అప్పుడు నో చెప్పి.. ఇప్పుడు ఓకే అన్న సాయి పల్లవి!

- Advertisement -

అందంతో కాకుండా డ్యాన్స్‌ , నటనతో లక్షలాది అభిమానులను సంపాదించుకుంది స్టార్‌ హీరోయిన్‌ సాయిపల్లవి. నటిగా దక్షిణాదిలో ఆమెకు ఉన్నడిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ప్రేమమ్‌’సినిమాతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైన ఈ మలయాళి ముద్దుగుమ్మ.. ‘ఫిదా’తో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ‘ఫిదా’లో సాయి పల్లవి మాట్లాడిన తెలంగాణ యాసకు కుర్రకారంతా ఫ్లాట్‌ అయ్యారు. ఆ తర్వాత చేసిన ప్రతి సినిమా… ఆమెకు భారీ పాపులారిటీని తెచ్చిపెట్టింది. పారితోషికాన్ని పట్టించుకోకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేసూకుంటూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మలయాళ భామ తెలంగాణ హీరో నితిన్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రంగ్‌దే సినిమాతో ఓ మోస్తరు విజయం అందుకున్న నితిన్‌.. ప్రస్తుతం ‘మ్యాస్ట్రో’సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్‌ బ్లాక్‌ బ‍్లస్టర్‌ మూవీ అందాధున్‌కి రీమేక్‌ ఇది. ఈ సినిమా అనంతరం వక్కంతం వంశీతో నితిన్‌ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవిని హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్‌ భావిస్తుందట. ఇప్పటికే ఈ విషయంపై సాయిపల్లవిని సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందే తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.

- Advertisement -

కాగా, గతంలో నితిన్‌ హీరోగా తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోందని వార్తలు వినిపించాయి. కానీ ఆ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో సాయి పల్లవి ఆ మూవీకి నో చెప్పిందట. మరి ఇప్పుడైనా నితిన్‌తో సాయి పల్లవి రొమాన్స్‌ చేస్తుందో లేదో చూడాలి.

పూరి జగన్నాథ్‌పై ఛార్మి సీరియస్‌.. కారణం ఇదేనా?

పవన్‌ కళ్యాణ్ ఒక వ్యసనం.. నవ్వులు పూయిస్తున్న బండ్ల గణేశ్‌ స్పీచ్‌

కొండెక్కిన కోడి.. క‌రోనానే కార‌ణ‌మా?

‘మాస్ట‌ర్’‌ డైరెక్టర్‌తో ప్రభాస్‌ సినిమా !

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -