Monday, May 5, 2025
- Advertisement -

‘డకాయిట్’లో శృతి హాసన్

- Advertisement -

వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అడివి శేష్. తాజాగా డకాయిట్ అనే పాన్ ఇండియా సినిమాతో వస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ మ్యాసీవ్ యాక్షన్ షెడ్యూల్‌లో మేకర్స్ లీడ్ కాస్ట్ పై కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు.

తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టులో జాయిన్ అయింది శృతి హాసన్. డకాయిట్ ఇద్దరు మాజీ ప్రేమికుల కథ. తమ జీవితాలను మార్చడానికి దోపిడి బాట పడతారు.శేష్, శ్రుతి జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ ప్రాజెక్ట్‌ను సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాత. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రజెంట్ చేస్తోంది. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.

అడివి శేష్, షానీల్ డియో ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే కూడా అందించారు. మేజర్ తర్వాత శేష్ యొక్క సెకెండ్ స్ట్రయిట్ హిందీ మూవీ. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -