Sunday, April 28, 2024
- Advertisement -

క్రేజీ కాంబో..అడివి శేష్ దర్శకత్వంలో రానా!

- Advertisement -

టాలీవుడ్ సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గతంలో మల్టీస్టారర్ సినిమాలంటే భయపడేవారు టాలీవుడ్ హీరోలు. కానీ ఇప్పుడు ఆ హద్దులను చెరిపేసి ముందుకు సాగుతున్నారు. ఇక హీరోలు చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక కొంతమంది హీరోలు దర్శకులుగా మారి సినిమాలు తీస్తున్నారు. ఇవి కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబడుతున్నాయి.

తాజాగా రానా దగ్గుబాటితో సినిమా చేసేందుకు ముందుకొచ్చారు హీరో అడవి శేష్‌.కొత్త కథలు , తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసి పెద్ద సక్సెస్ సాధిస్తాడని అడివి శేష్ కి పేరు ఉంది. త్వరలో గూడాచారి 2 సినిమాతో బాక్సాఫీస్ మీద దండయాత్రకు రాబోతున్నారు శేష్. దీంతో పాటు పలు ప్రాజెక్టులు చేతిలో ఉండగానే మెగా ఫోన్ పట్టేందుకు అదే దర్శకుడిగా సినిమా చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.

గోవాలో ఓ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళినప్పుడు అడివి శేష్ …రానాతో సినిమా, కథకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మంచి కథతో ఏడాదిలోపు రానా ముందుకు వెళ్తానని చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ వార్త టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రానా ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. హీరోగానే కాక విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, గెస్ట్ రోల్స్ లో మెప్పిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -