Saturday, May 10, 2025
- Advertisement -

అలా చెబితే.. ఈమెకు అసహ్యమట

- Advertisement -

సౌత్ హీరోయిన్లలో శృతిహాసన్ రూటే వేరు. కమల్ హాసన్ ముద్దుల కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన శృతి.. తర్వాత తన వర్సెటైల్ టాలెంట్ తో.. టాప్ హీరోయిన్ ప్లేస్ కొట్టేసింది. టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా టాప్ గేర్ లో కెరీర్ కంటిన్యూ చేస్తోంది. బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతూ.. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. అలాంటి శృతి.. ఏ కామెంట్ చేసినా.. ఈ మధ్య హాట్ టాపిక్ అవడం మామూలైపోయింది.

ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్న శృతి హాసన్.. లవ్ టాపిక్ పై, అమ్మాయిలను అబ్బాయిలు చూసే తీరుపై డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యింది. అందమైన అమ్మాయిలను అబ్బాయిలు ఆరాధనగా చూడడం వరకూ ఓకే కానీ.. వెకిలిగా చూస్తేనే ఒళ్లు మండుతుందని శృతి చెప్పింది. అంతేకాదు.. బలవంతంగా ఐ లవ్ యూ చెప్పడం, చెప్పించుకోవడం చూస్తే.. తనకు అసహ్యమని తేల్చేసింది.

ఇది విన్న చాలా మంది.. అబ్బో శృతి గడుసుదే అనుకుంటున్నారట. ఇకపై ఆమెతో కాస్త జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నారట. ఒక్క మాటతో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ హీరోయిన్ ను చూస్తుంటే.. దటీజ్ శృతి అనాలనిపిస్తోంది కదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -