Wednesday, May 22, 2024
- Advertisement -

నయనతో తన ప్రేమకథను సినిమాగా తీయిస్తున్న శింబు..!

- Advertisement -

తమిళ నటుడు శింబు, నటీమణి నయనతారల మధ్య ప్రేమకథ గురించి కొత్త వివరించనక్కర్లేదు. వీరి ప్రేమ కథ సంచలనాత్మకం.

లిప్ లాకులు పెట్టుకొని ల్యాప్ టాప్ తో ఫోటోలు తీసుకొని.. వీటిని లీక్ చేయించుకొన్న ఘనత వీరిది.

మరి ఇంతటి గాఢమైన ప్రేమకథ త్వరలోనే సినిమాగా తెరపైకి ఎక్కనుంది! ఈ సినిమాకు కీలకమైన ఇన్ పుట్స్ ను శింబునే అందిస్తుండటం ఇక్కడ పెద్ద విశేషం. మరి  సినిమా పూర్తి వివరాలు ఏమిటంటే…. కొన్ని రోజుల క్రితమే ఒక తమిళ నిర్మాత ఈ విషయాన్ని ప్రకటించాడు.

నయనతార, శింబుల ప్రేమ కథ ఆధారంగా తాను సినిమాను రూపొందిచబోతున్నట్టుగా ఆయన ప్రకటించాడు. అయితే ప్రకటన పట్ల శింబు ఎలాంటి అభ్యంతరమూ తెలపలేదు. సినిమా వాళ్ల జీవితాల ఆధారంగా సినిమాలు రావడం విడ్డూరం కాదు కానీ.. ఇలా వారి జీవితంలోని కొన్ని ఎపిసోడ్ల ఆధారంగా సినిమాలురావడం మాత్రం విడ్డూరమే. ఇలాంటి వ్యవహారాలపై సదరు తారలు అభ్యంతరం తెలిపే అవకాశం కూడా ఉంది. అయితే శింబు ఇలాంటి వ్యవహారాలను లైట్ తీసుకోగలడు. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు కీలకమైన కథ వివరాలను శింబునే అందించాడట!

తమ ప్రేమకథలోని కీలకమైన మలుపులను శింబునే ఆ సినిమా దర్శక, నిర్మాతలకు చెప్పినట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ విధంగా శింబు తన గురించి సినిమా తీస్తున్నవారిని ఎంకరేజ్ చేస్తున్నాడు. మరి ఈ వ్యవహారం పట్ల నయనతార ఎలా స్పందిస్తుంది? శింబుతో తన ప్రేమ కథ తెరకెక్కుతోందంటే ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది? అనేవి ఆసక్తికరమైన విషయాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -