Sunday, May 19, 2024
- Advertisement -

నాగ‌శౌర్య‌తో ‘కిరాక్ పార్టీ’ చేసుకోనున్న హీరోయిన్‌

- Advertisement -

ఇంకా తాను న‌టించిన ఒక్క సినిమా కూడా విడుద‌ల కాలేదు. కానీ అవ‌కాశాలు అప్పుడే వ‌చ్చేస్తున్నాయి. ఈ ప‌రిస్థితి నిఖిల్‌తో న‌టించిన కిరాక్ పార్టీ హీరోయిన్ సిమ్రాన్ పరీంజా. కిరాక్ పార్టీ సినిమా మార్చి 16వ తేదీన విడుద‌లయ్యే కానుంది. అంత‌కుముందే ఓ మంచి ఆఫ‌ర్ ప‌ట్టేసింది. అందమైన భామలను ఎప్పుడూ ఆద‌రించే టాలీవుడ్ ఈ అమ్మ‌డిని ప‌ట్టేశారు. నాలుగేళ్లుగా గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న సిమ్రాన్ పరీంజా హిందీ టీవీ సీరియల్స్‌కే పరిమితమైంది.

ఈమెకు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన సినిమా కిర్రాక్ పార్టీలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు. ఇంకా ఆ సినిమా విడుదల కాకముందే ఈమెకు మరో అవకాశం వచ్చేసింది. నాగశౌర్య హీరోగా కొత్త ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ చక్రవర్తితో తీసే సినిమాలో సిమ్రాన్ పరీంజాను ఫైనల్ చేశారు. నాగశౌర్య, సిమ్రాన్ కాంబినేష‌న్ సూప‌ర్‌హిట్‌గా నిలిచే అవ‌కాశం ఉంది. యూత్‌ను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండేలా శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి ధీమాతో ఉన్నాడు. తన స్క్రిప్ట్ కు సరిగ్గా సరిపోయే హీరోయిన్ సిమ్రాన్ పరీంజా అని ఫీలయి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాడు. సిమ్రాన్ కూడా క‌థ‌కు ఓకే చెప్పేసిందంట‌. నాగశౌర్యతో సిమ్ర‌న్ న‌టించేందుకు సిద్ధ‌మైంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -