Tuesday, April 30, 2024
- Advertisement -

సింగం-3 రివ్యూ

- Advertisement -
Singam 3 Movie Review

సూర్య, అనుష్క,  శ్రుతిహాసన్‌ హీరోహీరోయిన్లుగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సింగం-3. గత మూడు నెలలుగా కోలీవుడ్, టాలీవుడ్ అభిమానులను ఊరిస్తున్న సింగం-3 ఎట్టకేలకు ఈ రోజు మధ్యాహ్నం ధియేటర్లలో ప్రత్యక్షమయ్యాడు. సింగం సిరీస్ లో  ముచ్చటగా మూడో సారి  తెరకెక్కిన సింగం-3 తో సూర్య మరో భారీ విజయాన్ని అందుకున్నాడో లేదో తెలుసుకుందాం.

ఇకకధలోకి వెళ్తే..

ఈ సినిమాలో సూర్య .. నరసింహగా, శృతి హాసన్.. అగ్నిగా,  అనుష్క .. కావ్యగా నటించారు.

ఏపిలో  పేరు మోసిన పోలీస్ ఆఫీసరైన  నరసింహకు  ఓ  కమీషనర్ హత్యకు సంబంధించిన ప్రత్యేక కేసును అప్పగిస్తాడు కర్ణాటక హోం మంత్రి.     ఆ కేసును తనదైన శైలిలో విచారించి హంతకులను పట్టుకున్న నరసింహ కమీషనర్ హత్య వెనుక విఠల్ అనే ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడని  తెలుసుకుంటాడు.  ఆస్ట్రేలియాలో ఉండే విఠల్‍ పై నరసింహ ఎలా పోరాటం చేశాడు. నరసింహ…  తన భార్య కావ్యకు ఎందుకు దూరంగా ఉన్నట్లు నటిస్తాడు..? శ్రుతికి.. నరసింహకి సంబంధం ఏంటి అన్న ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలనుకుంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.  

ఇక కథనంలోకి వెళ్తే….

ఒక కేసును ఛేదించే పనిలో విదేశాల్లో ఉన్న విలన్ తో పోరాడి అతన్ని ఓడించడం అనే సినిమానే సింగం-3. ఫస్టాఫ్ స్లోగా ఉన్నా సెకండాఫ్ మాత్రం పరుగులు పెట్టేసింది. ప్రీ ఇంటర్వెల్ సన్నివేశాల నుండి సినిమా థ్రిల్లింగ్ యాక్షన్ లో సాగుతుంది.

ఇక ఎవరు ఎలా చేశారంటే..

పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎగ్రెసివ్ గా కనిపిస్తూ సూర్య చెప్పిన డైలాగులు, చేసిన ఫైట్స్ సూపర్బ్. శ్రుతి గ్లామర్ షోకి మాత్రమే పరిమితమైంది. అనూష్క ఆ గ్లామర్ తో కూడా ఆకట్టుకోలేకపోయింది. విలన్ పాత్ర చాలా బలంగా ఉండి హీరోకు ఛాలెంజింగ్ గా నిలబడింది. సూర్య నటన యాక్షన్ ఎపిసోడ్స్ ప్లస్ పాయింట్స్ కాగా రొటీన్ కధ మైనస్ అయ్యింది. ఓవరాల్ గా సింగం-3 అన్న పేరు పెట్టి సింగం-2నే చూపించారన్న టాక్ వినిపిస్తోంది. 

{youtube}h0cbD0NS6Fk{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -