ర్యాప్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించాడు నోయెల్. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి పలు చిత్రాలలో నటించాడు. ‘ఈగ’,’మగధీర’, ‘కుమారి 21 F’ ,’నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ వంటి సినిమాలలో నటించి తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.కుమారి 21 F సినిమాలో నోయెల్ నటించిన నెగిటివ్ పాత్రకు మంచి పేరు వచ్చింది. నోయెల్ తాజాగా తన పెళ్లి గురించి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిపాడు. నోయెల్ ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోనున్నాడు.
దర్శకుడు తేజ తెరకెక్కించిన 1000 అబద్ధాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయిన ఎస్తర్ నొరోన్హతో నోయెల్ ఎంగేజ్మెంట్ జరిగింది. 1000 అబద్ధాలు ప్లాప్ కావడంతో ఆమె పెద్దగా అవకాశాలు రాలేదు.’భీమవరం బుల్లోడు’ .. ‘జయ జానకి నాయక వంటి చిత్రాలలో నటించింది. వీరిద్దరు గతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరి ప్రేమ పెళ్లి బంధంగా మార్చుకునే క్రమంలో గత సంవత్సరం వీరి ఎంగేజ్మెంట్ జరిగిందని నోయెల్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నయనం సినిమాలో నటించే సమయంలో వీరిద్దరు ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా విడుదల కాకపోయినప్పటికి ఈ సినిమా వీరి జీవితంలో ఎప్పటికి గుర్తుండిపోతుంది. హార్రర్ నేపథ్యం తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.కాని ఈ సినిమాలో నటించే సమయంలో వీరిద్దరు చాలా దగ్గరైయ్యారు . ఈ బంధం కాస్తా ప్రేమగా మారి , తరువాత పెళ్లి వరకు దారితీసింది.
త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తుంది.
- 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!