Friday, May 10, 2024
- Advertisement -

సింగ‌ర్ చిన్మ‌యిపై ట్రోలింగ్‌…ఘాటుగా స్పందించిన భ‌ర్త‌

- Advertisement -

గ‌త కొన్నాళ్లుగా నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నారు సింగ‌ర్ చిన్మ‌యి.లైంగిక వేధింప‌లు గురించి ఆమె తీవ్ర పోరాటం చేస్తున్నది.#మీటూ పేరుతో పోరాటం చేస్తున్న చిన్మయి ప‌లువురిపై లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది.ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు, తమిళ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాజాలు పలువురు మహిళా ఆర్టిస్టులను లైంగికంగా వేధించారని గాయని చిన్మయి శ్రీపాద ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఎలాంటి సభ్యత్వ రుసుము చెల్లించలేదన్న కారణం చూపుతూ చిన్మయిని యూనియన్ నుంచి బహిష్కరించారు.ఈ చర్యను ఖండించిన చిన్మయి శ్రీపాద.. మరి గత రెండేళ్లుగా తన ఫీజులో 10 శాతాన్ని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించింది.

అయితే ఈ సందర్భంగా చిన్మయిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న ప్రబుద్ధులకు ఆమె భర్త నటుడు రాహుల్ రవీంద్రన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.‘మీలాంటి పనీపాటా లేని వెధవలు నా టైమ్ లైన్ లోకి చేరి గోలగోల చేస్తున్నారు. నిజం చెబుతున్నా.. మీలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ నాకు నిజంగా చికాకుగా ఉందంటూ ట్విట్ చేశాడు.చిన్మయి లాంటి ధైర్యవంతులు సమాజంలో చాలామంది ఉన్నారు. అయితే అలాంటి అమ్మాయిలు మీలాంటి వాళ్లను అసలు కోరుకుంటారా? అన్నదే నా అనుమానం’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.రాహుల్ రవీంద్రన్ చేసిన ట్విట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

https://www.youtube.com/watch?v=BB-rLE0Pu-s

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -