Friday, May 3, 2024
- Advertisement -

నందమూరి వారసత్వంపై ఆశలు నిలిపిన ఎన్టీఆర్…… సర్వత్రా ప్రశంశలు

- Advertisement -

ఎన్టీఆర్ వారసులు, వారసురాండ్రు చాలా మందే ఉన్నారు. ఆయన పేరు చెప్పుకుని లాభపడుతూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరికీ కూడా ఆ ఎన్టీఆర్ పేరు నిలబెట్టే స్థాయి, ఎన్టీఆర్ ఆశయాల కోసం ఫైట్ చేసే సామర్థ్యం లేవు. అందుకే హార్డ్ కోర్ నందమూరి అభిమానులు కూడా ఈ ఎన్టీఆర్ వారసుల విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. బాలయ్యతో సహా అందరూ చంద్రబాబు ముందు సాగిలపడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉంటారు.

అయితే ఆ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడు. రాజకీయం కోసం సొంత కుటుంబ సభ్యులతో కూడా డ్రామాలు ఆడే చంద్రబాబు ఈ సారి హరికృష్ణ కుటుంబాన్ని టార్గెట్ చేశాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌ని అధికారంలోకి వచ్చే అవకాశమే లేని తెలంగాణాకు పరిమితం చేసి ఎపిలో లోకేష్‌కి పోటీ లేకుండా చేయాలని చూశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తన సోదరి కోసం తెలంగాణాలో ప్రచారం చేస్తే పచ్చ మీడియా సాయంతో ఎన్టీఆర్‌ని తెలంగాణాకు చెందిన నాయకుడిగా ప్రొజెక్ట్ చేయాలన్నది బాబు ప్లాన్.

అయితే తాను ఇంకా 2009నాటి ఎన్టీఆర్ కాదని తారక్ నిరూపించుకున్నాడు. అప్పుడు బాబు ప్లాన్స్‌కి, వెన్నుపోటు రాజకీయానికి చిత్తయ్యాడు కానీ ఈ సారి మాత్రం చంద్రబాబుకు సూపర్ ఝలక్ ఇచ్చాడు. పచ్చ మీడియా జనాలు, టిడిపి నాయకులు కూడా మింగలేక కక్కలేని పరిస్థితిని కల్పించాడు. సోదరి గెలుపు కోరుతూ రిలీజ్ చేసిన ప్రెస్ మీట్‌లో తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని చెప్పిన తారక్…………. తెలుగు దేశం కోసం పాటుపడిన నాయకుడిగా హరికృష్ణ పేరు కూడా ప్రస్తావించాడు. అయితే నారా చంద్రబాబు పేరును మాత్రం కనీసం పలకడానికి కూడా ఇష్టపడలేదు. పూర్తిగా అవాయిడ్ చేశాడు. ఆ రకంగా చంద్రబాబుతో డైరెక్ట్‌గా యుద్ధానికి రెడీ అని సిగ్నల్ ఇచ్చాడు. లోకేష్‌తో పోటీపడడం ఖాయం అన్న సంకేతాన్ని కూడా నందమూరి అభిమానులకు పంపించాడు. అసలే చేసిన తప్పుల పుణ్యమాని బాబుకు శతృవులు ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడిక ఎన్టీఆర్ రూపంలో రాబోతున్న అత్యంత శక్తివంతమైన ఆయుధం నుంచి బాబు…..మరీ ముఖ్యంగా లోకేష్ ఎలా బయటపడతాడో చూడాలి. ఏది ఏమైనా బాబును ఎదిరించే ధైర్యం, చంద్రబాబు పవర్‌ని వెంట్రుకతో సమానంగా తీసేసి ఢీకొట్టే సామర్థ్యం తనకు ఉన్నాయని ఎన్టీఆర్ డైరెక్ట్‌గా నందమూరి అభిమానులకు సందేశాన్ని ఇవ్వడం మాత్రం నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని పెంచుతోంటే నారావారి క్యాంప్‌లో, టిడిపి నాయకుల్లో ఆందోళనను పెంచుతున్నది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -