Tuesday, April 30, 2024
- Advertisement -

తెలంగాణాలో త‌మ మ‌ద్ద‌తు వారికే న‌న్న వైసీపీ

- Advertisement -

తెలంగాణాలో ఎన్నిక‌ల వేడి మ‌రింత రాసుకుంది. నేడే నామినేష‌న్లు చివ‌రి రోజు కావ‌డంతో అన్ని పార్టీల భ్య‌ర్తులు నామినేష‌న్ వేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. నామినేష‌న్లు పూర్తి అయిన వెంట‌నే ఇక ఎన్నిక‌ల ప్ర‌చారం మ‌రింత ర‌స‌వత్త‌రంగా మార‌నుంది. అధికార టీఆర్ఎస్ పార్టీనీ ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌, టీజేఎస్, టీడీపీ, సీపీఐ పార్టీలు క‌ల‌సి మ‌హాకూట‌మిని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.

అన్ని పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారంలో హ‌డావుడీ చేస్తుంటే…వైసీపీ మాత్రం సైలెంట్ గా ఉంది. నామినేష‌న్ల ప‌ర్వం కూడ మ‌గియ‌నుండంతో త‌మ మ‌ద్ద‌తును ఎవ‌రిక‌నేది ప్ర‌క‌టించింది తెలంగాణా వైసీపీ. 2014 ఎన్నిక‌ల్లో రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేసిన వైసీపీ సీట్లు ద‌క్కించుకోవ‌డంతో విఫ‌ల‌యం అయ్యింది.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ న‌త పూర్తి ఏకాగ్ర‌త అంతా ఏపీ పైనే పెట్ట‌డంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో పోటీచేయాలనే ఆలోచనను విరమించుకున్నారు. పోటీ చేయ‌కుంటే ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తార‌నే విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. దీనిపై క్లారిటీ ఇచ్చారు వైసీపీ నేత‌లు.

తమ పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదు కాబట్టి.. తాము ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత రామ్మోహన్ రావు ప్రకటించారు. తాము ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదన్నారు. ఏ పార్టీ అభ్యర్థి అభివృద్ధికి పెద్దపీట వేస్తారో.. వారికే తమ మద్దతు ఉంటుందని చెప్పారు. పార్టీతో సంబంధం లేకుండా అభ్యర్థిని బట్టి తమ మద్దతు తెలుపుతామన్నారు. ఇవ‌న్నీ చూస్తుంటే అధికార‌పార్టీకే మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -