Saturday, May 18, 2024
- Advertisement -

రామ్‌చ‌ర‌ణ్, బోయ‌పాటి సినిమాలో స్నేహా

- Advertisement -

రామ్‌చరణ్‌-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం (జ‌న‌వ‌రి 19) హైదరాబాద్ గచ్చిబౌలిలోని వనదేవత ఆలయంలో ప్రారంభమైంది. ఈ సినిమాలో కైరా అద్వానీ చరణ్ సరసన నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ఒక‌ప్ప‌టి హీరోయిన్ స్నేహ ముఖ్య పాత్రలో పోషించ‌నున్నార‌ట‌. ఆమె పాత్ర ఏంటి ? ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ఇంకా తెలియాలి. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో ఉపేంద్ర‌కు భార్య‌గా న‌టించిన స్నేహ త‌ర్వాత మ‌రే సినిమాలు చేయ‌లేదు. రెండేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ సినిమా చేస్తున్న‌ది ఇదే. యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్న లుక్స్‌లో కనిపించబోతున్నాడ‌ని తెలుస్తోంది. బోయపాటి శ్రీనివాస్ అంటేనే యాక్ష‌న్ సీన్స్‌కు పెట్టింది పేరు. ఈ సినిమాలో గ‌త సినిమాల మాదిరి ఉండే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -