కెమెరామెన్‌గా పనిచేసిన సాయి శ్రీరామ్ దర్శకుడిగా మారాడు. ‘గీతాంజలి, ఎక్కడికి పోతావు చిన్నవాడ, సుప్రీమ్’ వంటి సినిమాలకు సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా పనిచేశాడు. ఇప్పుడు దర్శకత్వంతో వస్తున్నాడు. యువ నటుడు నాగ శౌర్య హీరోగా నటించనున్నాడు. ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమాలో నివేథా థామస్ హీరోయిన్‌గా నటించనుంది.
మంచి కథను ఎంపిక చేసుకుంటూ చిన్న, పెద్ద సినిమాలు చేస్తున్న నటి నివేథా థామస్. శ్రీరామ్ తనకు రాసిన పాత్ర, సినిమా కథ నచ్చడంతో వెంటనే నివేథ డేట్స్ ఇచ్చిందని సమాచారం. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మన్యం విజయ్ కుమార్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. గతంలో నివేథా థామస్ నిన్నుకోరి, జెంటిల్‌మేన్, జై లవకుశ సినిమాల్లో నటించింది.
