Monday, May 20, 2024
- Advertisement -

నో డౌట్….. హోదా ద్రోహం బాబుదే….. తేల్చిచెప్పిన నీతి అయోగ్

- Advertisement -

2014ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లను అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసింది ప్రత్యేక హోదా అంశమే అన్నది నిజం. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ప్రత్యేక హోదా ప్రాధాన్య అంశం అయ్యేలా పచ్చ బ్యాచ్ అందరూ కలిసి ప్లాన్ చేశారు. వెంకయ్యనాయుడు నుంచి మొదలైన డ్రామాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పచ్చమీడియాలు కలిసి రక్తికట్టించారు. విభజనతో అన్నీ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదానే శరణ్యం……ఆ ఒక్కటీ వస్తే ఆంధ్రప్రదేశ్‌కి అన్నీ వచ్చినట్టే అని హోదా గొప్పతనం గురించి చాలా చాలా చెప్పారు. ఆ హోదాను కేంద్రంలో అధికారంలోకి వచ్చినవాళ్ళు ఇవ్వాలి. కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడం ఖాయం అని అప్పటికే జనాలకు అర్థమైంది కాబట్టి…..మోడీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబుకే ఓటేయమని చెప్పడానికి ప్రత్యేక హోదా అంశాన్ని అద్భుతంగా వాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఓటర్లను ప్రభావితం చేశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత……..మరీ ముఖ్యంగా ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయన తర్వాత నుంచీ హోదాను మోడీ కాళ్ళ దగ్గర ఫణంగా పెట్టేశాడు చంద్రబాబు. రాజధాని శంకుస్థాపన సభలో హోదా అని చెప్పడం మర్చిపోయానని బొంకాడు. ఇక ఆ తర్వాత నుంచీ మోడీ హోదా ఇవ్వడం లేదు…….అందుకే ప్యాకేజ్‌కి ఒప్పుకున్నాం అన్నాడు.

కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ హోదా విషయంలో చంద్రబాబు పాపాన్ని బయటపెట్టేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎపికి హోదా కావాలన్న అభ్యర్థన ఏదీ రాలేదని ……..అలాంటి అభ్యర్థన వస్తే పరిశీలిస్తామని చెప్పాడు. నీతి అయోగ్ వైఎస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆయన పక్కనే చంద్రబాబు కూర్చుని ఉండడం గమనార్హం. ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు కనీసం రాజీవ్ కుమార్ మాటలను ఖండించలేకపోయాడు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అర్థం అయ్యే విషయం ఒక్కటే. మోడీ ఇవ్వకపోవడం……..నీతి అయోగ్ అడ్డు చెప్పడం అని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, పచ్చ మీడియా చెప్పిన కబుర్లన్నీ హంబక్. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను పణంగా పెడుతూ మోడీని, కేంద్రప్రభుత్వాన్ని, నీతి అయోగ్‌ని హోదా కావాలని చెప్పి చంద్రబాబు అస్సలు అడగలేదన్నది చంద్రబాబు సమక్షంలోనే నీతి అయోగ్ వైఎస్ ఛైర్మన్ మాట్లాడిన మాటల సాక్షిగా తెలిసొచ్చిన నిజం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -