Saturday, May 18, 2024
- Advertisement -

హీరోయిన్ పెళ్లితో.. శ్రీదేవి కుటుంబంలో ఆనందం

- Advertisement -

అందాల న‌టి మ‌ర‌ణంతో బాలీవుడ్‌లో పెద్ద కుటుంబమైన క‌పూర్ ఫ్యామిలీ విషాదంలో మునిగింది. శ్రీదేవి మ‌ర‌ణించి నెల దాటినా ఇంకా ఆ కుటుంబం విషాదం నుంచి కోలుకోలేక‌పోతుంది. అయితే ఓ హీరోయిన్ పెళ్లితో శ్రీదేవి కుటుంబంలో ఆనందం నిండే అవ‌కాశం ఉంది. ఆ హీరోయిన్‌కు.. శ్రీదేవి కుటుంబానికి ఏం స‌బంధం అనుకుంటున్నారా? బాలీవుడ్ బ్యూటీ సోన‌మ్ క‌పూర్ శ్రీదేవి కుటుంబ‌స‌భ్యురాలే!

శ్రీదేవి మ‌రిది అనిల్‌ కపూర్‌. ఆయ‌న కూతురు సోన‌మ్‌క‌పూర్‌. సోన‌మ్ బాలీవుడ్ స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి ఆక‌ట్టుకుంది. సినిమా కెరీర్ బాగున్న స‌మ‌యంలోనే పెళ్లి చేసుకోనున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం సోనమ్ వ‌య‌సు 32. ఆమె పారిశ్రామికవేత్త ఆనంద్‌ ఆహుజాతో కొన్నాళ్లుగా లివింగ్ రిలేషన్‌లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వీరి పెళ్లి చేయాల‌ని కుటుంబ‌స‌భ్యులు ఫిక్సయ్యార‌ని ముంబై మిర్రర్ అనే మ్యాగ‌జైన్ ప్ర‌క‌టించింది.

ఈ సంవ‌త్స‌రం మే 11 లేదా 12వ తేదీన జెనీవాలో సోన‌మ్ క‌పూర్‌, ఆనంద్ ఆహుజ పెళ్లి చేసుకోనున్నార‌ని తెలిపింది. ఈ మేరకు ఇరు కుటుంబాలూ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అతిథులను విదేశానికి తరలించేందుకు ఇప్పటికే విమాన టికెట్ల‌ బుకింగ్‌ కూడా ప్రారంభమైనట్లు తెలిసింది. దీంతో పెద్దకోడలు శ్రీదేవి మరణంతో విషాదంలో ఉన్న కపూర్ కుటుంబం తేరుకునే అవ‌కాశం ఉంది.

సోన‌మ్‌క‌పూర్ సినీ ఇండ‌స్ట్రీకి 2008లో సావరియా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2016లో వచ్చిన నీర్జా సినిమాకు సోన‌మ్ జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. ఇటీవల అక్ష‌య్‌కుమార్‌తో క‌లిసి ప్యాడ్‌మ్యాన్ సినిమాలో సోన‌మ్ క‌నిపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -