Friday, April 26, 2024
- Advertisement -

మామఅల్లుళ్ల‌కు హీరోయిన్లు దొరికారు…..

- Advertisement -

మామఅల్లుళ్లు మొద‌టిసారి క‌లిసి చేస్తున్న సినిమా. మ‌ల్టీస్టార‌ర్ సినిమాను ద‌ర్శ‌కుడు బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా విష‌యంలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డవుతున్నాయి. దగ్గుబాటి వెంకటేశ్‌, అక్కినేని నాగ చైతన్య మామఅల్లుళ్లు. వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేయాల‌ని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నా కుద‌ర‌లేదు. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు కుద‌ర‌డం.. దీనికి మంచి హీరోయిన్లు ఎంపిక‌వ‌డంతో సినిమాపై ఆస‌క్తి ఏర్ప‌డింది.

ఇప్పుడు మామఅల్లుళ్ల‌కు హీరోయిన్లు ల‌భించారు. వెంక‌టేశ్ త‌న హిట్ పెయిర్ అయిన న‌య‌న‌తార‌తో, అల్లుడు నాగ‌చైత‌న్య త‌న భార్య స‌మంతతో ఈ సినిమా చేస్తున్న‌ట్లు స‌మాచారం. మే నెల‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ప‌నులు కొన‌సాగుతున్నాయి. వెంకటేశ్‌, నయనతారల‌ జంట సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్‌. స‌మంత‌, చైతూ కాంబినేష‌న్ కూడా అంతే.

ప్ర‌స్తుతం వెంకటేశ్ వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో నారా రోహిత్‌తో, అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో హీరో వరుణ్ తేజ్‌తో క‌లిసి సినిమా చేస్తున్నాడు. చైతూ కూడా వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఒప్పేసుకున్నాడు. మ‌రీ ఈ సినిమా ఎలా ఉండ‌బోతుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -