Sunday, May 19, 2024
- Advertisement -

పెళ్లి ఖ‌ర్చులను విరాళంగా ఇస్తానన్న భామ‌

- Advertisement -

బాలీవుడ్ హీరో సోనమ్‌ కపూర్ త్వర‌లో పెళ్లి చేసుకుంటుద‌నే వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. దిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్‌ ఆహూజా, సోనమ్‌ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరుకుటుంబాలు అంగీకరించడంతో మే మొదటి వారంలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. వీరి వివాహం స్విట్జర్లాండ్‌లో కానీ ముంబయిలో కానీ జరిగే అవకాశం ఉందని వదంతులు వినిపిస్తున్నాయి. దీనిపై మొద‌టిసారి స్పందించిన సోన‌మ్ పెళ్లి అక్క‌డేక్క‌డో ఎందుకు చేసుకుంటాను నా పెళ్లి మా ఇంట్లోనే చేసుకుంటాను అని బ‌దులిచ్చింది.

విదేశాల‌లో చేసుకుంటే అయ్యే ఖ‌ర్యును అవ‌స‌రం అయితే విరాళంగా ఇస్తాను కాని నేను మాత్రం పెళ్లి ఇక్క‌డే చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది.ఇప్పటికే సంగీత వేడుకకు డ్యాన్స్‌ రిహార్సల్స్‌, ఏర్పాట్లు పూర్తైనట్లు తెలుస్తోంది.ప్రస్తుతం సోనమ్‌ ‘వీరే ది వెడ్డింగ్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో సోనమ్‌తో పాటు కరీనా కపూర్‌, స్వరా భాస్కర్‌ కీలక పాత్రలు పోషించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -