Thursday, May 16, 2024
- Advertisement -

భూమా ఫ్యామిలీకి ఝలక్… ఎస్వీ మోహన్‌రెడ్డి, అఖిలప్రియలకు టికెట్స్ కేన్సిల్

- Advertisement -

భూమా కుటుంబానికి చంద్రబాబు మార్క్ మ్యూజిక్ స్టార్ట్ అయిందా? భూమా నాగిరెడ్డిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం, హింసించి మరీ పార్టీలో చేర్చుకోవడం…..ఆ తర్వాత కూడా ఆ జన్మ శతృత్వం ఉన్న నాయకులను గెలిపించాలని భూమాను ఆదేశించడం…..ఆ ఒత్తిడిలో భూమా మరణం…..ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే భూమా అభిమానుల ఆగ్రహాన్ని అఖిల ప్రియను మంత్రిని చేయడంతో కొంత వరకూ శాంతపరిచాడు చంద్రబాబు.

అయితే 2019 ఎన్నికల నాటికి మాత్రం భూమా ఫ్యామిలీని పూర్తిగా సైడ్‌లైన్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు బాబు. దానికి ముఖ్య కారణం ఆర్థికంగా భూమా కుటుంబ సభ్యులకంటే ఎంతో బలవంతుడైన టీజీ వెంకటేష్….తన కొడుక్కు కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టడమే. ఇప్పటికే రాజ్యసభ సీటు కోసం భారీగా ఖర్చుపెట్టిన టీజీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు మొత్తానికి ఖర్చుపెడతానని బాబుకు ఆఫర్ ఇచ్చాడు. అందుకే ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ మోహన్‌రెడ్డికి 2019లో టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పేశాడు బాబు. టీజీ వెంకటేష్ కుమారుడు పోటీ చేస్తాడని తేల్చేశాడు. 2019లో కర్నూలు అసెంబ్లీ టికెట్ నాదే అని చెప్పి ఆల్రెడీ టీజీ వెంకటేష్ కుమారుడు ప్రచారం కూడా చేసుకుంటున్నాడు. ఇక ఆళ్ళగడ్డలో కూడా అఖిలప్రియ కంటే ఏవీ సుబ్బారెడ్డి ఆర్థికంగాను, బలం, బలగం విషయంలోనూ బలవంతుడని బాబు భావిస్తున్నాడు. అందుకే ఇప్పటి నుంచే ఏవీ సుబ్బారెడ్డిని ప్రోత్సహిస్తున్నాడు. ‘మీ గెలుపు కోసం పార్టీ మొత్తం కష్టపడిందని…..2019లో సీటు ఆశించకుండా పార్టీ గెలుపు కోసం మీరు తోడ్పడాలని భూమా కుటుంబ సభ్యులకు చెప్పేశాడు చంద్రబాబు. ఇక ఇఫ్పుడు భూమా కుటుంబ సభ్యులకు కూడా పెద్దగా ఆప్షన్స్ లేవు. అందుకే అంతర్గతంగా సన్నిహితులైన వాళ్ళతో బాబు మార్క్ రాజకీయాలకు బలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. ఈ విషయాలు తెలిశాక భూమా ప్రత్యర్థులను బాబు ఇంకా ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉండడం అఖిలతో పాటు భూమా కుటుంబసభ్యులందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బాబు మార్క్ పద్మవ్యూహాన్ని ఛేదించి 2019లో కూడా భూమా కుటుంబ సభ్యులు రాజకీయంగా నిలబడగలరా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -