బాలీవుడ్ బ్యూటీక్వీన్ సోనమ్ కపూర్ దేశంలో ఫ్యాషన్ ఐకాన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. సినిమాల్లో ఫ్యాషనబుల్ డ్రెస్సుల్లో మెరుపులు మెరిపించే ఈ భామ ఫ్యాషన్ షోలలో కూడా షోస్టాపర్‌గా క్యాట్ వాక్‌చేస్తూ మైమరపిస్తోంది.
తాజాగా ‘100 ఏళ్ల భారతీయ సినిమా వేడుక సందర్భంగా ‘ది ఆర్టిసన్ జ్యూయలరీ డిజైన్ అవార్డ్స్ కార్యక్రమం లో ఐకానిక్ జ్యూయలరీని ప్రచారకర్త సోనమ్‌కపూర్‌తో ప్రదర్శించనున్నారు. భారతదేశంలో జెమ్ అండ్ జ్యూయలరీ పరిశ్రమకు అత్యున్నతస్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నది జెమ్ అండ్ జ్యూయలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) ఈ ‘ది ఆర్టిసన్ జ్యూయలరీ డిజైన్ అవార్డ్స్‌ను ప్రకటించింది. గత 25 ఏళ్లుగా పరిశ్రమ కోసం అవార్డు,రివార్డుల కార్యక్రమాలను నిర్వహిస్తున్న జీజేఈపీసీ దేశంలోని వర్ధమాన జ్యూయలరీ డిజైనర్లను ఈ కార్యక్రమంలో పాల్గొనా ల్సిందిగా ఆహ్వానిస్తోంది. వారు తమ డిజైన్లను ఆగస్టు 15లోగా అందించాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా ఫ్యాషన్ ఐకాన్, జీజేఈపీసీ ప్రచారకర్త సోనమ్ కపూర్ మాట్లాడుతూ ”ధరించే ఆభరణం ఒకరి వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని నేను విశ్వసిస్తాను. ఆర్టిసన్ జ్యూయలరీ అవార్డు అనేది జీజేఈపీసీ చేపట్టిన అద్భుతమైన కార్యక్రమం. తమ సృజనాత్మకతను,ప్రతిభను చాటేందుకు ఒక వేదికను ఇది డిజైనర్లకు అందిస్తుందిఅని అన్నారు. జీజేఈపీసీ ఇండియా చైర్మన్ విపుల్‌షా మాట్లాడుతూ ”భారతీయ జీవితానికి ప్రతీకగా నిలిచింది భారతీయసినిమా. అత్యంత ప్రభావపూరితమైన ఈ కళా మాధ్యమం మన జీవితాల్లోని వివిధ అంశాలను స్పర్శిస్తోంది. తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని మేము ఈ వేదిక ద్వారా జ్యూయలరీ డిజైనర్లకు అందిస్తున్నాం. ప్రముఖులతో కూడిన ప్యానల్ ఫైనలిస్టులను ఎంపికచేస్తుంది. అని తెలిపారు.