Friday, April 19, 2024
- Advertisement -

తన ఆఫీసులోని 200 మందికి వ్యాక్సిన్ వేయించిన దిల్ రాజు?

- Advertisement -

ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికి పోతున్నాయి. ఇలాంటి తరుణంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో అధిక జనాభా గల భారతదేశంలో ఈఏడాది జనవరి నెల నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే.మొదటిదశలో 60 సంవత్సరాలు పైబడిన వారికి, రెండో దశలో 45 సంవత్సరాలు పైబడిన వారికి , ప్రస్తుతం మూడో దశ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.

వ్యాక్సిన్ పై ప్రజలలో ఏర్పడిన భయాందోళనలు తొలగించడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా నష్టాలు చవిచూసిన పలు సంస్థలు తమ దగ్గర పనిచేసే ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ వేయించి తమ కార్యకలాపాలను ప్రారంభించారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో పలు సినిమా షూటింగ్స్ ప్రారంభం అవుతున్న సందర్భంలో షూటింగ్‌లో పాల్గొనే ప్ర‌తి ఒక్క‌రు కరోనా వ్యాక్సిన్ క‌నీసం ఒక్క డోస్ అయినా వేయించుకోవాల‌ని నిర్మాత మండ‌లి ఆదేశాల జారీ చేసింది.

Also read:నా కెరీర్ ని నేనే పాడు చేసుకున్న.. ఇకపై ఆలా చెయ్యను: హెబ్బా పటేల్

దీంతో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తన ఆఫీసులో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటుచేసి తన ప్రొడక్షన్‌లో పనిచేసే సిబ్బంది, ఆఫీస్‌ స్టాఫ్‌కు,వ్యక్తిగత సిబ్బందికి ఇలా దాదాపు 200 మందికి కరోనా వ్యాక్సిన్‌ వేయించారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో “థ్యాంక్యూ”, అల్లు అర్జున్ తో “ఐకాన్’ , సమంత ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీ “శాకుంతలం “చిత్రాలతో పాటు హిందీలో “జెర్సీ” వంటి బడా ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.

Also read:అందుడిగా అల్లు అర్జున్… ఆ సినిమా కోసం అంత సిద్ధం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -