Saturday, April 20, 2024
- Advertisement -

ఐకాన్ మూవీలో బన్నీ రోల్ పై షాకింగ్ న్యూస్…!

- Advertisement -

అల్లు అర్జున్ తన కెరీర్లో సినిమాల పరంగా ప్రయోగాలు చేసింది తక్కువే. ఆ ప్రయోగాలు కూడా ఆయనకు సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయన అటుగా అడుగులు వేయలేదు. అల్లు అర్జున్, మంచు మనోజ్ హీరోలుగా నటించిన వేదం సినిమాలో కేబుల్ రాజు పాత్రలో అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు. ఆ సినిమా బన్నీకి మంచి పేరు తీసుకువచ్చిప్పటికీ కమర్షియల్ గా ఆ సినిమా విజయం సాధించలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఐదు రోజుల పెళ్లి కాన్సెప్ట్ తో వరుడు అనే సినిమా చేశాడు. ఈ సినిమా పాయింట్ బాగున్నప్పటికీ ఎందుకో ప్రేక్షకులు ఆదరించలేదు.

అలా అల్లు అర్జున్ చేసిన ప్రయోగాలు రెండు విఫలం కావడంతో మళ్లీ ప్రయోగాల జోలికి అల్లు అర్జున్ వెళ్ళలేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత అల్లు అర్జున్ వరుసగా డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న పుష్ప సినిమా లో లారీ డ్రైవర్ గా, మొరటు వ్యక్తి గా బన్నీ నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ లో మాస్ లుక్ లో అల్లు అర్జున్ కేక పుట్టించాడు.

ఈ సినిమా తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఇందులో బన్నీ పోషించే రోల్ పై ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో బన్నీ అంధుడిగా కనిపించనున్నట్లు టాక్. బన్నీ ఇంతకుముందెప్పుడూ ఇటువంటి పాత్రలో కనిపించలేదు. ఈ న్యూస్ విని అభిమానులు నిజంగానే షాక్ అవుతున్నారు. ‘ఐకాన్’ ‘కనబడుట లేదు’ అని ట్యాగ్ లైన్ తో ఈ మూవీని తెరకెక్కించనున్నారు.

Also Read

‘పుష్ప’లో రష్మిక పాత్ర ఏంటో తెలుసా?

అప్పుడు తేజు సాహసం.. ఇప్పుడు చైతూ వంతు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -