అందుడిగా అల్లు అర్జున్… ఆ సినిమా కోసం అంత సిద్ధం!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా “వకీల్ సాబ్‌” సినిమాతో ఈ సంవత్సరం భారీ విజయాన్ని నమోదు చేశాడు ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌ మూవీ సెట్స్‌పై ఉండగానే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌తో “ఐకాన్‌ “చిత్రాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే కొన్ని కారణాల వల్ల బన్నీ ఈ ప్రాజెక్టు చేసేందుకు అప్పట్లో ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఈసినిమా ఆగిపోయిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా బన్నీ,వేణు శ్రీరామ్ కాంబినేషన్లో ఇప్పటికే ఫిక్సయిన” ఐకాన్ ” మూవీ పై మరోసారి సినీ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది.తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ “పుష్ప” సినిమా తర్వాత “ఐకాన్ ” సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నందట. ఇప్పటికే డైరెక్టర్ వేణు శ్రీరామ్ స్క్రిప్ట్ లో మార్పులు చేసి రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

Also read:మహేశ్‌, ప్రభాస్‌ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన సుబ్బరాజు!

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఐకాన్ మూవీలో అల్లు అర్జున్ అంధుడి పాత్రలో మొదటిసారి వెండితెరపై కనపడనున్నాడట.కథలో హీరో పాత్రకు చూపు ఉండదట. అంటే అంధుడి పాత్రన్నమాట.ఐకాన్ సినిమా టైటిల్ కింద కనబడుటలేదు అనే ట్యాగ్ లైన్ కూడ హీరో పాత్రను ఉద్దేశించే పెట్టారట. అల్లు అర్జున్ లాంటి యువ క్రేజీ హీరోలు ఇలాంటి భిన్నమైన సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమే. ప్రస్తుతం అల్లు అర్జున్ ఐకాన్ సినిమాకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం పై చిత్రబృందం అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

Also read:అతను నా ప్రియుడు కాదు.. అమలాపాల్ షాకింగ్ కామెంట్స్!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -