Friday, March 29, 2024
- Advertisement -

అప్పుల పాలైన ‘రియల్‌’ హీరో

- Advertisement -

వెండితెరపై విలన్‌గా ఆకట్టుకున్న సోనూసూద్‌ కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ‘రియల్‌ హీరో’ అయిపోయాడు. ఎక్కడ ఏ ఆపద ఉన్నా.. నేనున్నాను అంటూ ముందుకు వచ్చి సాయం అందిస్తున్నాడు. భాష‌, ప్రాంతం, కుల‌మ‌తాలు అనే ప‌ట్టింపులేవీ లేకుండా ఆపదలో ఉన్నవారికి ఆప‌న్న హ‌స్తం అందించారు. అనేక మంది వలస కార్మికులను తమ గమ్యస్థానాలకు చేర్చి పెద్దమనసును చాటుకున్నాడు. విదేశాల్లోని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా విమానాన్ని వేసి, కోవిడ్‌ సంక్షోభంతో ఆపదలో ఉన్న అనేక మందిని ఆదుకొని ప్రజల మనస్సుల్లో ‘రియల్‌ హీరో’గా నిలిచాడు. ఫలానా చోట.. ఫలానా సమస్య ఉందన్న విషయం తన దృష్టికి వస్తే చాలు.. వెంటనే తనకు చేతనైనా సాయం అందిస్తూ తన ఊదారతను చాటుకుంటున్నాడు.

అయితే ఇలా ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకుంటూ పోవ‌డానికి ఆయ‌న ఎంత‌గానో ఖ‌ర్చు చేశాడట. దీనికోసం త‌న ఆస్తుల‌ను తాక‌ట్టు పెట్టిన‌ట్లు తెలిసింది. ప‌ద‌లో ఉన్న వారిని ఆదుకునేందుకు సోనూసూద్ రూ.10 కోట్లు జ‌మ చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. అయితే ఇందు కోసం ఎవ‌రి వ‌ద్దా చేయి చాచి అడ‌గలేదట. మ‌నీ కంట్రోల్ నివేదిక ప్ర‌కారం.. ముంబై జూహూలోని తన ఎనిమిది ఆస్తులను తనఖా పెట్టి రూ.10 కోట్లు అప్పు తీసుకుని.. ఆ డబ్బుతో సాయం అందిస్తూ వచ్చారు. ఇందులో రెండు దుకాణాలు, ఆరు ప్లాట్లు ఉన్న‌ట్టు స‌మాచారం. సోనూసూద్‌ అప్పు విషయాన్ని ఈ విష‌యాన్ని జేఎల్ఎల్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స‌ర్వీసెస్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ రితేశ్ మెహ‌తా ధ్రువీక‌రించారు. ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఇతరుకు సాయం చేస్తున్న సోనూసూద్‌ నిజంగా ‘రియల్‌ హీరో’ అనే చెప్పాలి.

సోనూకు అరుదైన గౌరవం
నిరు పేదలకు విశేషమైన సేవలందించిన నటుడు సోనూ సూద్‌కు అరుదైన గుర్తింపు లభించింది. ‘2020లో ప్రపంచంలో టాప్‌ 50 ఆసియన్‌ సెలబ్రిటీల’ జాబితాలో ఆయన ఏకంగా మొదటి స్థానం దక్కించుకున్నారు. యూకేలోని ఈస్టర్న్‌ ఐ అనే వార పత్రిక దీన్ని ప్రచురించింది. ఈ పత్రిక ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎడిటర్‌ అస్‌జాద్‌ నాజిర్‌ ఈ జాబితా రూపొందించారు. ఇందులో మొదటి స్థానంలో సోనూ సూద్, రెండో స్థానంలో కెనడా సోషల్‌ మీడియా స్టార్‌ లిల్లీ సింగ్‌లో నిలిచారు.

వైభవంగా నిహారిక వివాహం.. నాగబాబు భావోద్వేగ ట్వీట్‌

టాలీవుడ్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ ఇవే..!

టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -