Thursday, May 2, 2024
- Advertisement -

తిరుపతి ఉప పోరు నువ్వా.. నేనా..

- Advertisement -

తిరుపతి పార్లమెంట్ ఉప పోరుతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించి అధికార వైఎస్సార్‌సీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఉప ఎన్నికలో గెలుపు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అటు తిరుపతి ఉప ఎన్నికలో గెలిచి ఏపీలో సత్తా చాటాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. జనసేనతో కలిసి ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నేతను బరిలో దించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌ బావిస్తోంది. ఇలా అన్ని పార్టీలు ఉప ఎన్నికపై దృష్టిసారించడంతో తిరుపతిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

తిరుపతి సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్(వైఎస్సార్‌సీపీ) మరణంతో తిరుపతి స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ ప్రజాప్రతినిధి మరణిస్తే పోటీ వద్దన్న నిబద్దతకు అన్ని పార్టీలు తిలోదకాలు ఇచ్చి పోటీకి కాలు దువ్వుతున్నాయి.ఈ ఏడాది ఎన్నిక జరిగే అవకాశం లేకపోయినప్పటికీ…ఇప్పటి నుంచే పార్టీలన్నీ గెలుపు లెక్కల్లో మునిగిపోయాయి. ముఖ్యంగా అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతి పక్ష టీడీపీ నువ్వా నేనా అనే రీతిలో పోటీకి సన్నద్ధమవుతున్నాయి.

సంప్రదాయానికి విరుద్ధంగా టీడీపీ అందరికన్నా ముందుగా ఉప ఎన్నిక అభ్యర్ధిని ప్రకటించి షాకిచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన పనబాక లక్ష్మినే మళ్లీ బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించారు. పనబాక బీజేపీలో చేరతారని, ఆ పార్టీ తరపున తిరుపతి నుంచి పోటీచేస్తారని వార్తలు వినిపించడంతో అప్రమత్తమైన టీడీపీ.. ఆమెను అభ్యర్థిగా ప్రకటించి ఉపపోరుకు సమరశంఖం పూరించారు. ఇక టీడీపీ అభ్యర్ధిని ప్రకటించిన కొన్ని రోజులకే అధికార వైఎస్సార్‌సీపీ కూడా అనూహ్యంగా ఉప ఎన్నిక బరిలో కొత్త అభ్యర్ధిని నిలుపుతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెమన్‌రెడ్డి వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురుమూర్తిని బరిలో నిలిపింది. గురుమూర్తిది శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం..మన్న సముద్రం గ్రామం కావడం..ఆయనకు కలిసి వచ్చింది. మరోవైపు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే ఉండటంతో గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉంది.

తెలంగాణలో వచ్చిన ఊపును… ఏపీలోనూ కొనసాగించేలా జనంలోకి దూసుకెళ్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచినట్టుగానే…ఏపీలో తిరుపతి ఎంపీ స్థానంలో గెలుపొంది….పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. మిత్ర పక్షం జనసేనను కలుపుకుని పోవాలని భావిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో తమకే టికెట్‌ ఇవ్వాలని జనసేన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. జనసేనను పోటీ చేయిస్తే టీడీపీకి లాభం చేకూరుతుదని బీజేపీ నేతలు భావిస్తున్నారట. ఇదే విషయాన్ని అదిష్టానానికి కూడా తెలియజేశారట. పవన్‌ కల్యాణ్‌ మాత్రం జనసేనకు టికెట్‌ ఇస్తేనే ప్రచారం చేస్తానని పట్టుపడుతున్నట్లు చెబుతున్నారు.

ఒకప్పుడు తిరుపతి లోకసభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ పార్టీ తరఫున డాక్టర్ చింతామోహన్ పలుమార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ఇప్పుడు మరోసారి ఆయన్నే బరిలో దింపి పార్టీకి మళ్లీ పునర్‌వైభవం తేవాలని కాంగ్రెస్ భావిస్తోందట. ఉప ఎన్నికకు ఇంకా సమయం ఉన్నాఅన్ని పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలతో తిరుపతిలో రాజకీయ వేడెక్కింది.

బాబు తీరుతో తెలుగు తమ్ముళ్లు బేజారు!

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకుందా?

కారు పార్టీతో కాంగ్రెస్‌ కలిసి నడుస్తుందా?

బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. అలాంటి నేతలే ప్రధాన టార్గెట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -