Friday, April 19, 2024
- Advertisement -

కన్నీరు పెట్టుకున్న సోనుసూద్..!

- Advertisement -

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ గురించి కరోనా కి ముందు పెద్దగా ఎవరికీ తెలియదు. ఆయన ఓ నటుడిగా మాత్రమే అందరికీ పరిచయం. కానీ ఎప్పుడైతే దేశాన్ని కరోనా వైరస్ ప్రభావం వల్ల లాక్ డౌన్ మొదలు పెట్టారో అప్పటి నుంచి సోనూ సూద్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగింది. కరోనా కష్ట కాలంలో ఎంతో మంది నిరుపేదలకు సాయం చేస్తూ రియల్ లైఫ్ హీరోగా నిలిచిన సోనూ సూద్. ఇప్పటికీ ఆయన ఎంతో మందికి సహాయం చేస్తూనే ఉన్నారు.

తాజాగా డాన్స్ దీవానే ఎపిసోడ్ షూట్ కోసం సెట్స్‌ను సందర్శించినప్పుడు నటుడు సోను సూద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. దానికి కారణం తీవ్ర అనారోగ్యంతో ఉన్న భారతి అనే మహిళను చికిత్స కోసం నాగ్పూర్ నుంచి హైదరాబాద్ కి విమానంలో ఎలా తీసుకువెళ్ళారో అతనికి చూపించారు. అతడు మా కుబుంబానికి ఓ దేవుడు లాంటి వాడని ఉద్వేగానికి లోనయ్యారు. చేతులెత్తి మొక్కుతూ దండం పెట్టారు.

ఇది లైవ్ లో చూస్తున్నంత సేపు సోనూ సూద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంతమంది నిరుపేదల ప్రాణాలను కాపాడిన ఆ సంతృప్తి వెలకట్టలేనిదన్నారు. ప్రజలు ఆస్పత్రుల్లో బెడ్స్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తాను ప్రశాంతంగా ఎలా ఉండగలనని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్నవారిని చూసి స్పందించాలని కోరారు. తనను అభినందించడం సులువే కానీ తాను చేసిన పనిని అందరు చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -