Sunday, May 12, 2024
- Advertisement -

రెండో పెళ్లికి రెడీ అయిన ర‌జినీకాంత్ కూతురు

- Advertisement -

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ రెండో కూతురు సౌందర్య రెండో పెళ్లికి రెడీ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.సౌందర్యకు గ‌తంలో పెళ్లి అయింది.ఆమెకు ఓ ఐదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.అయితే భ‌ర్త‌తో అభిప్రాయ‌భేదాలు రావ‌డంతో భ‌ర్త అశ్విన్ నుంచి విడాకులు తీసుకుంది.ప్ర‌స్తుతం కొడుకుతో జీవిస్తుంది సౌందర్య.తాజాగా ఆమె రెండో పెళ్లికి రెడీ అయిన‌ట్లు తెలుస్తుంది.రీసెంట్ గా వ్యాపారవేత్త విషాగన్ వనంగముడితో ఆమెకి నిశ్చితార్ధం జరిగినట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది.

విషాగన్ కి కూడా ఇది రెండో పెళ్లే.. అతడి తమిళ సినిమాలతో బంధం కూడా ఉంది. విషాగన్ కొన్ని సినిమాల‌లో కూడా న‌టించాడు.ప్రముఖ వ్యాపారవేత్త వనంగముడి కొడుకే విషాగన్. విషాగన్ కి సొంతంగా ఫార్మసిటకల్ కంపనీ కూడా ఉంది. ఇక సౌందర్య విషయానికొస్తే ‘కొచ్చాడియాన్’ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తన బావ ధనుష్ హీరోగా ‘విఐపి2’ సినిమాను తెరకెక్కించింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘెరంగా ఫెయిల్ అయ్యాడు.ప్ర‌స్తుతం ఆమె ర‌జినీకాంత్ సినిమాల కాల్ షీట్లు చూస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -