Saturday, April 20, 2024
- Advertisement -

ఆ స్టార్ దర్శకుడికి నో చెప్పిన త్రిష… కారణం అదే?

- Advertisement -

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో త్రిష ఒకరు.తెలుగు ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈమె వరుస అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగించింది. అయితే ఈ మధ్యకాలంలో ఈమెకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయో.. లేక వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం లేదో తెలియదు కానీ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యారు.

తెలుగు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తమిళంలో పలు సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే మెగాస్టార్ 153 మూడవ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో మెగాస్టార్ సరసన నటించే అవకాశాన్ని ముందుగా త్రిషకే కల్పించారు. ఈ విషయం గురించి చిత్రబృందం అధికారిక ప్రకటన చేసిన తర్వాత ఈమె క్రియేటివ్ డిఫరెన్సెస్ పేరు చెబుతూ సినిమా నుంచి తప్పుకుంది. ఈ విధంగా మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశాన్ని పోగొట్టుకుంది.

గత కొద్దిరోజుల నుంచి త్రిష తెలుగులో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని, అది లేడీ ఓరియెంటెడ్ పాత్రలపై తన ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే పరాజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి లేడి ఓరియంటెడ్ స్క్రిప్ట్ ద్వారా త్రిషను సంప్రదిస్తే కథ నచ్చకపోవడంతో ఈ భామ ఈ సినిమాకు నో చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -