Tuesday, May 21, 2024
- Advertisement -

ఫ్రెంచ్ రీమేక్‌లో త‌మిళ స్టార్ హీరోల‌తో నితిన్‌

- Advertisement -

రాజకీయాల్లోకి పూర్తిగా వ‌చ్చేసిన సినిమాల‌పై ఇంకా క‌మ‌ల్‌హాస‌న్ మ‌క్కువ పోలేదు. ఎన్నిక‌ల స‌మ‌యం ఇంకా ఏడాది ఉండ‌డంతో ఆలోపు ఒక సినిమా చేసి ఇక పార్టీపై ఫోక‌స్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అందుకే ఓ సినిమా చేయాల‌ని ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో కమల్‌ హాసన్ సినీ గంలోనూ కొనసాగేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. నటనకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించిన కమల్‌ నిర్మాతగా సినీ రంగంలో కొనసాగనున్నారు. రాజ్‌కమల్‌ ఇంటర్‌నేషనల్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై వరుసగా సినిమాలు నిర్మించాలని ప్లాన్ ఉంది.

అయితే వాటికి ఏర్పాట్ల‌న్నీ పూర్త‌యిన‌ట్టు తెలుస్తోంది. ఈ బ్యానర్‌పై విక్రమ్‌తో కలిసి ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు కమల్‌. రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్‌ హీరోగా నటించనున్నాడట. ఓ ఫ్రెంచ్‌ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు చీకటిరాజ్యం ఫేం రాజేశ్‌ సెల్వ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇప్పటికే రీమేక్‌ రైట్స్ తీసుకున్న చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఈ సినిమాలో నితిన్‌, క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు విక్రమ్‌ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. తెలుగులో ప్రస్తుతం శ్రీనివాస కల్యాణం సినిమాతో బిజీగా ఉన్న ఉన్న నితిన్ కమల్‌ సినిమా అవ‌కాశంపై ఎలా స్పందిస్తారో తెలియాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -