Tuesday, May 6, 2025
- Advertisement -

ఎక్స్ పోజింగ్, లిప్ లాక్ కావాలని అన్నారు : శ్రీముఖి

- Advertisement -

శ్రీముఖి.. బుల్లితెరపై ఈ భామకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమె కు విపరితపమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే శ్రీముఖి పలు షోలకు హోస్ట్ గా చేసింది. బిగ్ బాస్-3లో రన్నర్ గా నిలిచి మరింత క్రేజ్ సంపాధించుకుంది. ఇక శ్రీముఖి రెండు, మూడు సినిమాల్లో కూడా నటించింది. ‘జులాయి’ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినిమలకు దూరంగా ఉంది.

అయితే శ్రీముఖి సినిమాలకు దూరం కావడం ఫ్యాన్స్ కి కూడా నిరాశపరించింది. దీనిపై టీవీలో శ్రీముఖి స్పందించింది. ‘జులాయి’ చిత్రం చేస్తున్నప్పుడే సినిమాలు వద్దని మా నాన్న చెప్పారని శ్రీముఖి తెలిపింది. ఈ సినిమానే చివరి చిత్రం కావాలని ఆదేశించారని చెప్పింది. అయితే ఆ తర్వాత రెండు, మూడు ఆఫర్లు రావడంతో ఆ సినిమాల్లో కూడా నటించానని… ఆ తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి, టీవీ షోలతో బిజీ అయ్యానని తెలిపింది.

టీవీ షోలు చేస్తుంటే, సినిమా అవకాశాలు రావని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చెప్పారని… ఆయన చెప్పినట్టుగానే జరిగిందని వెల్లడించింది. ఆ తర్వాత రెండు, మూడు సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించారని తెలిపింది. వాటిలో తన పాత్రకు తగిన ప్రాముఖ్యత లేకపోవడం ఒక కారణమైతే… ఎక్స్ పోజింగ్, లిప్ లాక్ సీన్లు చేయాలని అడగడం మరో కారణమని చెప్పింది. అలాంటి సిన్స్ చేయడం ఇష్టం లేక సినిమాలు వదిలేశానని.. అందుకే బుల్లితెరపై బిజీ అయ్యానని శ్రీముఖి చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -