Friday, May 3, 2024
- Advertisement -

హీరోయిన్ తో రొమాన్స్ చేసి.. చివరికి చెల్లెలు అనేశాడు

- Advertisement -

సినీ పరిశ్రమలో.. హీరో హీరోయిన్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆన్ స్క్రీన్ లో వారి రొమాన్స్ బాగుండాలంటే.. ఆఫ్ స్క్రీన్ లో వారు మంచి ఫ్రెండ్స్ అయి ఉండాలి అంటూ ఉంటారు. అందుకే ఇప్పటి నటులు… ఫ్రెండ్స్ లా కలిసి మెలిసి ఉంటారు. అయితే ఇప్పుడు క్రికెట్ నుంచి మూవీస్ లోకి వచ్చిన యంగ్ హీరో మాత్రం.. తనతో రొమాన్స్ చేసిన హీరోయిన్ తనకు చెల్లెలు లాంటిందని చెప్పడం విశేషం. ఆ స్టార్ ఎవరో కాదు.. బెట్టింగ్ ఆరోపణలతో, వివాదాలతో క్రికెట్ కెరీర్ ను మధ్యలోనే పోగొట్టుకున్న స్టార్ క్రికెట్ ప్లేయర్, బౌలర్ శ్రీశాంత్. ఈ క్రికెటర్ హీరోగా మారి ‘టీమ్ 5’ అనే సినిమా చేసాడు. మలయాళం, తమిళ, తెలుగు భాషలతో పాటు హిందీలో కూడా విడుదల అయ్యేలా కనిపిస్తోన్న ఈ సినిమా జూలై 14న రిలీజ్ కానుండటంతో.. ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ నెపథ్యంలో తాజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీశాంత్ మాట్లాడుతూ.. తన కో-స్టార్, హీరోయిన్ నిక్కీ గల్రాని పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రధానంగా తనకు ఇది తొలి చిత్రమని, కానీ నిక్కీ గల్రాని ఇప్పటికే 25 చిత్రాలకు పైగా చేసిందని.. అందుకే తనతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసినప్పటికీ ఆమె తనకు చెల్లెలితో సమానమని చెప్పి శ్రీశాంత్ ఆశ్చర్యపరిచాడు.

అంతేకాకుండా నటన విషయంలో తనకు ఆమె ఎంతో నేర్పించిందని.. తను నాకు చిన్నతాం నుంచీ తెలుసని, అందుకే తనను చెల్లెలిగా చూస్తానని పేర్కొన్నాడు. చివరగా తమ ఫ్యామిలీలో అమ్మ, నాన్న, చెల్లెలు, అన్నయ్య అందరూ సినిమా రంగానికి చెందిన వారేనని, తాను మాత్రం క్రికెట్ రంగానికి వెళ్లి తిరిగి సినీ రంగానికి వచ్చానని.. తనకు సినిమా, క్రికెట్ రెండూ ఇష్టమేనని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే, బైక్ రేసర్లు అయిన ఐదుగురు స్నేహితుల జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో.. ఫాస్ట్ బౌలర్ అయిన శ్రీశాంత్ బైక్ రేసర్ గా కనిపించడం నిజంగా విశేషమే. ఇక ఇప్పుడు అంతకుమించి అనేలా హీరోయిన్ ను చెల్లెలు అని శ్రీశాంత్ మరింతగా ఆకట్టుకున్నట్లు అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -