Thursday, May 16, 2024
- Advertisement -

సింధు మొదటి స్థానం.. ప్రభాస్ ఆరో స్థానం..

- Advertisement -

దేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల పేర్లు తీస్తే.. అందులో తెలుగువారికి చోటు దక్కడం అరుదు. అయితే రీసెంట్ గా ప్రకటించిన ఈ జాబితాలో నెంబర్ వన్ ప్లేస్ తోపాటు.. ఆరో స్థానం కూడా తెలుగువారికే దక్కింది. గత ఏడాది రియో ఒలింపిక్స్ లో రజతం గెలిచి దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు.. తాజాగా ప్రకటించిన ‘అత్యంత ప్రభావవంతమైన భారతీయులు’ జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

ఈ జాబితాలో సింధునే అత్యంత పిన్న వయస్కురాలు కావడం విశేషం. ఆమెకిప్పుడు 22 ఏళ్లే. ఇక బాహుబలి మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోంగ్ తెచ్చుకుని.. యూత్ ఐకాన్ అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ జాబితాలో ఆరో స్థానం సంపాదించాడు. ఇక ఈ జాబితాలో మిగతా వ్యక్తుల విషయంకు వస్తే.. పంజాబ్ నటుడు.. గాయకుడు దిల్జీత్ దోసాంజ్ రెండో స్థానంలో నిలిచాడు. వివాద్స్పద మూవీ ‘లిప్ స్టిక్ అండర్ మై బురఖా’తో సంచలనం రేపుతున్న రైటర్.. ఫిలిం మేకర్ అలంకృత శ్రీవాస్తవ మూడో స్థానం సాధించాడు.

కమెడియన్ కరణ్ గిల్ నాలుగో స్థానంలో.. చెఫ్-రెస్టారెంట్ యజమాని మను చోప్రా ఐదో స్థానంలో నిలిచారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ బాలీవుడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు.. ప్రభాస్ తర్వాత.. ఏడో స్థానంలో నిలిచాడు. మ్యుజీషియన్ బాద్షా.. డిజైనర్ సంజయ్ గార్గ్ తర్వాతి స్థానాలు సాధించారు. అలానే బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే పదో స్థానంలో నిలిచింది. జావెలిన్ త్రో యువ సంచలనం నీరజ్ చుప్రా 11వ స్థానంలో ఉన్నారు. ఏది ఏమైన మొదటి స్థానం దక్కించుకొని ప్రభాస్ కే షాక్ ఇచ్చింది సింధు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -