Monday, April 29, 2024
- Advertisement -

తాప్సీ చేసిన పనికి.. తలలు పట్టుకుంటున్న నిర్మాతలు

- Advertisement -

ఢిల్లీ ముద్దుగుమ్మ తాప్సీ మాటలకు ఈ మధ్య అదుపు లేకుండా పోయింది. నోటికి ఏంత మాట వస్తే.. అంత మాట్లాడేస్తోంది ఈ భామ. కోలీవుడ్ లో గంగ మూవీ సక్సెస్ తర్వాత.. హిందీలో అవకాశాలు రావడం.. అక్కడ పింక్ మూవీ తో కొట్టి కొట్టడంతో.. తాప్సీకి రెచ్చిపోతుంది. సౌత్ లో తన అందాన్ని తప్ప ట్యాలెంట్ ను చూడలేదంటూ.. కొన్నిసార్లు మాట్లాడి మళ్లీ సైలెంట్ ఆయిన తాప్సీ.. రీసెంట్ గా మళ్లీ నోరు జారింది.

బొడ్డుమీద కొబ్బరి చిప్పలు పెట్టి కొట్టడం ఏం సరసమో అంటూ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు మేకింగ్ ను కూడా తప్పు పట్టింది. తెలుగు సినిమాపై.. టాలీవుడ్ జనాలపై విమర్శలు గుప్పించిన తాప్సీపై.. ఇప్పుడు అందరూ భగ్గుమంటున్నారు. పైగా.. మరి కొన్ని రోజుల్లో ఈమె నటించిన ఆనందో బ్రహ్మ రిలీజ్ కావాల్సి ఉన్న టైంలో తాప్సీ ఇలా నోరు చేసుకోవడం.. గమనించాల్సిన విషయం. ఆనందో బ్రహ్మ మూవీ అంత కంప్లీట్ చేసి.. విడుదలకు రెడీ ఉన్నారు ఆ మూవీ మేకర్స్. ఇప్పుడు తాప్సీని బాయ్ కాట్ చేయాలంటూ.. ఆమెకు ఇక్కడ ఆదరణ ఉండదంటూ.. సోషల్ మీడియాలో కేంపెయిన్ ఊపందుకోంది.

పైగా ఆనందో బ్రహ్మ ప్రచారం కోసం ఈమె హైద్రాబాద్ వస్తే.. తాప్సీ ఫ్రెస్ మీట్స్ ను బాయ్ కాట్ చేయాలని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. ఇలా జరిగేసరికి ఆనందో బ్రహ్మ మేకర్స్ ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ తేడా వస్తే మాత్రం.. అసలే ఈ సినిమాకు తాప్సీ ఒక్కత్తే లీడ్ కాబట్టి.. ప్రమోషన్లకు గండి పడిపోయి.. సినిమా రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. ఒకవేళ తాప్సీ వచ్చినా కూడా.. ముందుగా అమ్మడు తన కామెంట్లపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏ విధంగా వివరణ ఇచ్చిన ఆమె మాటలు వినే పరిస్థితుల్లో ఎవరు లేరు అని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -