Friday, May 3, 2024
- Advertisement -

లారెన్స్ విసిరిన ఛాలెంజ్‌కు కౌంట‌ర్ ఇచ్చిన శ్రీ రెడ్డి

- Advertisement -

డాన్స్ మాస్టర్, దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ మీద శ్రీరెడ్డి చేసిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సంచ‌ల‌నంగా మారాయి. గతంలో లారెన్స్‌ తనపై అసభ్యకరంగా ప్రవర్తించాడని, గోల్కొండ హోటల్‌లో నా నడుము శరీర భాగాలను చూపించమన్నాడంటూ’ సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌కు లారెన్స్ కౌంట‌ర్ ఇచ్చారు.

శ్రీరెడ్డి తనను ఆఫర్స్ పేరుతో వాడుకున్నారని ఆరోపణలు చేస్తుంది. ఆమె సమస్య అదే కాబట్టి నేను ఓ బహిరంగ సవాల్ విసురుతున్నా.. నేనొక ప్రెస్ మీట్ పెడతా. అందర్నీ పిలుస్తా.. నువ్ కూడా రా.. నీకొక సీన్‌తో పాటు ఒక స్టెప్ కూడా ఇస్తా. ఆ సీన్‌ను, ఆ స్టెప్‌ను వేసి చూపించు. అలా అని నీకు కష్టమైనవి ఏమీ ఇవ్వను నటనకు కావాల్సిన బేసిక్స్ మాత్రమే ఇస్తా. చాలా సింపుల్ స్టెప్స్, డైలాగ్స్ ఇస్తా.. నువ్వు నిజంగా టాలెంటెడ్ అయితే నా ఎదుట, ప్రెస్ ఎదుట అవి చేసి చూపించు అంటూ బ‌హిరంగ స‌వాల్ విసిరారు. లారెన్స్ ఛాలెంజ్‌పై శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యారు.

ఈ ఛాలెంజ్‌కు సై అంటూ ఫేస్ బుక్ ద్వారా మెసేజ్‌ను పాస్ చేసింది శ్రీరెడ్డి. ‘నేను లారెన్స్ మాస్టర్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా.. అందరూ నన్ను ఆశీర్వదించండి’ అంటూ లారెన్స్‌కు కౌంటర్ ఇచ్చింది శ్రీరెడ్డి. మనం ఇద్దరం కలిసి నటిస్తే…. తెరపై మన కాంబినేషన్ అదిరిపోతుంది గురూ… అంటూ శ్రీరెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యానించడం గమనార్హం.

శ్రీరెడ్డి కౌంటర్ మీద లారెన్స్ ఎలా స్పందిస్తారు? ఆమెకు టాలెంట్ టెస్ట్ పెడతరా? ఒక వేళ ఆ టెస్టులో శ్రీరెడ్డి నెగ్గితే తన సినిమాలో అవాకశం ఇస్తారా? మున్ముందు ఈ ఇష్యూ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

https://www.facebook.com/iamsrireddy/posts/2174661562780764

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -