Tuesday, May 21, 2024
- Advertisement -

టీడీపీ నేత‌ల‌పై స‌భాహ‌క్కుల ఉల్లంగ‌న నోటీసు ఇచ్చిన జీవీఎల్‌

- Advertisement -

టీడీపీ నేతలు తనను బెదిరించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వారిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో తాను ప్రసంగించిన తర్వాత టీడీపీ నేతలు ఈ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ‘ఖబడ్డార్ .. తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అంటూ టీడీపీ నేతలు తనను బెదిరించారని ఆ నోటీస్ లో పేర్కొన్నారు.

టీడీపీ నేతలు తనను హెచ్చరిస్తున్న వీడియో ఆధారాలను రాజ్యసభ సెక్రటేరియట్ కు జీవీఎల్ అందజేసినట్టు తెలుస్తోంది. టీడీపీ వైఫల్యాలను రాజ్యసభ వేదికగా ఎండగట్టడంతోనే తనను టీడీపీ నేతలు బెదిరించారని జీవీఎల్ అన్నట్టు తెలుస్తోంది.

ఏపీ విభజన చట్టంపై కేంద్ర మానవ వనరుల శాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది. విభజన చట్టప్రకారం ఇప్పటికే ఏపీలో అనేక విద్యాసంస్థలు ఏర్పాటు చేశామని, సెంట్రల్‌ వర్సిటీకి ఇప్పటికే కేబినెట్‌ సూత్రపాయ ఆమోదం తెలిపిందని పేర్కొంది. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా స్పష్టం చేసింది.

ఈ మేరకు జీవీఎల్ నర్సింహా రావు ట్వీట్ చేశారు. తనను బెదిరింపులకు గురి చేసినందుకు రాజ్యసభ కార్యదర్శికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కార్యదర్శికి ఇచ్చిన లేఖను కూడా ట్విట్టర్‌లో పొందుపర్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -