Saturday, May 4, 2024
- Advertisement -

ఈసారి బిగ్‌బాస్‌లో ఎవ‌రెవ‌రో తెలిస్తే షాకే…

- Advertisement -

బిగ్‌బాస్ హిందిలో ఎంత హిట్ అయిందో తెలుగు త‌మిళ‌ భాష‌ల‌లో కూడా అంతే హిట్ అయింది. హిందిలో స‌ల్మాన్ ఖాన్ వాఖ్య‌త‌గా చేయ‌గా,త‌మిళ్‌లో లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ,తెలుగులో మ‌న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ యాంక‌ర్స్‌గా చేశారు.తెలుగులో ఎన్టీఆర్ యాంక‌రీంగ్‌కు మంచి పేరు వ‌చ్చింది. సీజ‌న్ 1లో క్రింద స్థాయి న‌టీన‌టుల‌ను తీసుకువ‌చ్చ‌ర‌నే కామెంట్స్ వినిపించాయి.బిగ్‌బాస్ సెంక‌డ్ సెష‌న్‌లో యాంక‌ర్ కూడా మారుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

మొద‌టి సీజ‌న్‌కు యాంక‌ర్‌గా చేసిన ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్‌లో మూవీ షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు.ఇక యాంక‌ర్‌గా నానిని తీసుకున్నార‌ని తెలుస్తుంది.నాని అయితే త‌న న్యాచుర‌ల్ యాక్టింగ్‌తో షోని బాగా న‌డిపిస్తాడు అని షో నిర్వ‌హ‌కులు అభిప్రాయంగా తెలుస్తుంది. మొద‌టి సీజ‌న్‌లా కాకుండా ఈ సీజ‌న్‌లో సెల‌బ్రిటిల‌ను తీసుకురావ‌ల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌!ఈసారి కంటెస్టెంట్స్ గా హీరో తరుణ్,మ‌నోజ్‌,ఆర్యఎన్ రాజేష్‌,తేజస్విని,గీతామాధురి తీసుకురావ‌ల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇక ప్ర‌ముఖ కామెడీయ‌న్స్‌ని కూడా తీసుకురావ‌ల‌ని చూస్తున్నారు.షో మ‌ధ్య‌లో పెద్ద పెద్ద స్టార్స్‌ని తీసుకువ‌చ్చి బిగ్‌బాస్‌పై హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు.పైగా ఈసారి బిగ్‌బాస్‌లో సామాన్యుల‌కి కూడా ఛాన్స్ ఇస్తున్నారు.టాలీవుడ్ సంచ‌ల‌న న‌టి శ్రీరెడ్డిని కూడా బిగ్‌బాస్‌లో తీసుకుంటే షోకి బాగా రేటింగ్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు.ఈ దిశ‌గా చ‌ర్చ‌లు న‌డుపుతున్నార‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -