Friday, May 10, 2024
- Advertisement -

హీరోయిన్ స‌మంత‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి

- Advertisement -

టాలీవుడ్ వివాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి త‌రుచు వార్త‌ల్లో నిల‌వాడ‌నికి ఎక్కువ ప్రాధ‌న్యం ఇస్తుంటుంది.తాజాగా ఆమె మ‌రోసారి త‌న నోటికి ప‌ని పెట్టింది.ఈ సారి అక్కినేని ఇంటి కోడ‌లు, హీరోయిన్ స‌మంత‌పై కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.ఎప్పుడు వివాదాస్పదంగా మాట్లాడే శ్రీరెడ్డి ,తాజాగా స‌మంత న‌టించిన యూటర్న్ మూవీ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వాఖ్య‌లు చేసింది.‘యూ టర్న్ మూవీ తమిళంలో పెద్ద హిట్టయింది. కంగ్రాట్స్ సమంత… నాకు కూడా ఈ మూవీ ఎంతగానో నచ్చింది’ అంటూ శ్రీరెడ్డి కాంప్లిమెంట్స్ ఇచ్చింది.శ్రీరెడ్డి ఇలా పాజిటివ్‌గా ఓ సినిమాపై మాట్లాడ‌టం ఇటీవ‌ల కాలంలో ఇదే మొద‌టిసారి.త‌రుచు శ్రీరెడ్డి ఎవ‌రో ఒక‌రిపై ఆరోప‌ణలు చేస్తునే ఉంటుంది.

స‌డ‌న‌గా ఇలా ఓ సినిమా గురించి మాట్లాడ‌టం చూసి అంద‌రికి ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది.ఇక టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డి,సినీ ఇండ‌స్ట్రీకి చెందిన వారిపై వ్య‌క్తిగ‌త కామెంట్స్ చేసి విమర్శ‌ల‌ను ఎదుర్కొంది.తెలుగు సినిమాల‌లో అవ‌కాశాలు రావ‌లంటే పడుకోవాల‌ని,ఇక్క‌డ ప‌డుకుంటేనే అవ‌కాశాలు ఇస్తారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.నాకు సినిమాల‌లో అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు ,కొడుకు అభిరామ్ నన్ను లైంగికంగా వాడుకున్నాడ‌ని చెప్పి పెను సంచ‌ల‌న‌మే సృష్టించింది శ్రీరెడ్డి.ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేయ‌డంతో శ్రీరెడ్డిని మీడియా సైతం ప‌క్క‌న పెట్టేసింది.దీంతో త‌మిళ ఇండ‌స్ట్రీని టార్గెట్ చేసుకుని అక్క‌డి వారిపై కూడా ఆరోప‌ణ‌లు చేయ‌డం మొద‌లుపెట్టింది శ్రీరెడ్డి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -