Saturday, May 11, 2024
- Advertisement -

శంకర్ కు శ్రీరెడ్డి వార్నింగ్

- Advertisement -

కమెడియన్ గా పేరు తెచ్చుకుని హీరోగా ప్రూవ్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ లోకి చేరాలని ఉబలాటపడి షకలక శంకర్ చేసిన శంభో శంకర అందరూ ఊహించినట్టుగానే ఆశించిన ఫలితం ఇవ్వని దిశగానే వెళ్తోంది. బాగా డ్రై గా ఉన్న సీజన్ లో విడుదల కావడం ఒక మైనస్ కాగా తన సినిమా గురించి మరీ అతిశయోక్తిగా శంకర్ చెప్పుకోవడం కూడా నెగటివ్ గానే పరిణమించింది. ఈ నేపథ్యంలో సక్సెస్ టూర్ అంటూ బూస్ట్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అవి ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి. ఇకపోతే నిన్నా మొన్నటి దాకా హీరోలని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న శ్రీరెడ్డి తాజాగా శంకర్ ని టార్గెట్ చేసింది. గతంలో తనను ఓ సారి తీవ్రంగా కామెంట్ చేసిన షకలక శంకర్ హద్దుల్లో ఉంటే మంచిదని తన సినిమా పబ్లిసిటీ కోసం అభిమాన హీరోను ఎంత వాడుకున్నా పర్వాలేదు కానీ తన జోలికి వస్తే మాత్రం కొట్టరాని చోట దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని హెచ్చరించింది.

కాకపోతే శంకర్ ఏమన్నాడు ఎలాంటి పదాలు వాడాడు లాంటివి మాత్రం శ్రీరెడ్డి బయటపెట్టలేదు. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన శంకర్ ఏదైనా అని ఉండటం లో ఆశ్చర్యం లేదు కానీ శ్రీరెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందిస్తోంది అనే డౌట్ రాక మానదు. నాని విషయంలో బాగా ఓవర్ అయిపోయిన శ్రీరెడ్డి ఆ తర్వాత లీగల్ నోటీసులు అందుకోగానే సైలెంట్ అయిపోయింది. వేరే విషయాల గురించి మాత్రమే తన సోషల్ మీడియా అకౌంట్ లో డిస్కస్ చేస్తోంది. మరి నాని వారం రోజుల క్షమాపణ డెడ్ లైన్ పని చేసిందో లేక లాయర్ సలహానో తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి షకలక శంకర్ కు ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్ గా మారింది. మా సంఘంలో ఉన్న వాళ్ళ జాతకాలు బయటపెడతాను అని మరోసారి వార్నింగ్ ఇచ్చిన శ్రీరెడ్డి అవి ఎప్పుడు ఎక్కడ బయటపెడుతుందో మాత్రం చెప్పడం లేదు. అసలు తన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయో లేదో కూడా తనకే ఎరుక.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -