Sunday, May 12, 2024
- Advertisement -

చైతు అత్త‌గా శ్రీదేవి

- Advertisement -
  • శైల‌జారెడ్డి అల్లుడు సినిమాకు ఎంపిక‌
  • మారుతీ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌

స‌మంత త‌ల్లి శ్రీదేవి ఏం కాదే. మ‌రీ శ్రీదేవికి అక్కినేని నాగ‌చైత‌న్య‌కు ఏం సంబంధం అని అనుకుంటున్నారా? స‌మంత త‌ల్లి శ్రీదేవి కాదు కదా! శ్రీదేవి ఎందుకు వ‌చ్చార‌ని అనుకుంటున్నారు. క‌దా! అదేం లేదు.. నాగ‌చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు సినిమాలో న‌టిస్తున్నాడు. ఒక‌ప్ప‌టి అందాల తార‌.. ఒక‌ప్ప‌టి ఏంటి ఇప్ప‌టికీ అందాల తార అయిన శ్రీదేవిని ఈ సినిమాలో అత్త పాత్ర‌కు ఎంపిక చేశార‌ని టాక్ వినిపిస్తోంది. మారుతీ ద‌ర్శ‌క‌త్వంలో శైల‌జారెడ్డి అల్లుడు సినిమా వ‌స్తోంది. అయితే ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య త‌న ప్రేయ‌సి సమంతను పెళ్లి చేసుకున్న అనంత‌రం త‌ర్వాత సినిమాల‌పై ఇప్పుడిప్పుడే సినిమాల‌పై దృష్టి సారిస్తున్నాడు. ప్రేమ‌మ్ సినిమా త‌ర్వాత ఇప్పుడు తిరిగి షూటింగులపై దృష్టి పెట్టడం మొదలెట్టాడు. ప్ర‌స్తుతం ప్రేమమ్ దర్శకుడు చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో సవ్యసాచి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మారుతీ సినిమాలో చేయడానికి పచ్చజెండా ఊపాడు. ఈ సినిమా టైటిల్ శైలజారెడ్డి అల్లుడు అని మారుతీ ముందుగానే ప్ర‌క‌టించాడు. ప్రస్తుతం సవ్యసాచి చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

అది పూర్త‌య్యేలోపు త‌న సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేయాల‌ని మారుతీ ప్లాన్ చేస్తున్నాడు. శైలజారెడ్డి అల్లుడు సినిమాకు న‌టీన‌టుల ఎంపిక చేస్తున్నారు. అత్త పాత్రకు రమ్యకృష్ణను తీసుకుంటారని పుకార్లు వ‌చ్చినా అది కాద‌ని తేలింది. తాజాగా అతిలోక సుందరి శ్రీదేవితో చేయించాలని ఫిక్స్ అయ్యాడంట. అత్త పాత్ర శ్రీదేవి చేస్తే సినిమాపై అంచ‌నాలు పెరుగుతాయ‌ని మారుతీ ఆలోచిస్తున్నాడు. అయితే శ్రీదేవిని ఒప్పించే బాధ్య‌త చైతు తండ్రి నాగార్జున‌కు అప్ప‌గించారని తెలుస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -