- Advertisement -

పుష్కరాల్లో 29 మంది చ‌నిపోయారు…. బాబుకు రాజీనామా వ‌ర్తించ‌దా..?

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్య‌లు భ‌లేగా ఉంటాయి. నేను చేస్తె ఒప్పు…ఇత‌రులు చేస్తె త‌ప్పు అన్న‌ట్లుగా మాట్లాడుతుంటారు. ఆస‌క్తిక‌ర విష‌యం ఏమిటంటె…ఏదైనా ప్ర‌మాదాలు జ‌రిగితె గ‌తంలో మంత్రులు రాజీనామ చేసే వార‌ని ..ఇప్పుడు ఆప‌రిస్థితిలేద‌ని…. డైరెక్టుగా అఖిల‌కు వార్నింగ్ ఇచ్చారు.

ప‌ర్యాట‌క‌శాఖ నిర్ల‌క్ష్యం కారనంగానె బోటు ప్ర‌మాదంలో ప్ర‌జ‌లు చ‌నిపోయార‌ని బాబు ధృవీక‌రించారు. దానికి మంత్రి అఖిల బాధ్య‌త వ‌హించి రాజీనామ చేయాల‌ని బాబు ఆలోచ‌న‌. నైతిక విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి రాజీనామ చేస్తె మ‌రింత గౌర‌వం పెరుగుతంద‌ని బాబు సెల‌విచ్చారు. అయితె దీని వెనుక పెద్ద క‌థే న‌డుస్తోంద‌నె చెప్పాలి. అఖిల‌ను మంత్రి ప‌ద‌వినుంచి త‌ప్పించేందుకె ఫెర్రీ బోటు ఘ‌ట‌న‌ను షాకుగా చూపుతున్నార‌నుకోవాలి.

పర్యాటక ప్రాంతంగా చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పవిత్ర సంగమం వద్ద ఘ‌ట‌న జుర‌గ‌డంతో బాబు ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకున్నారు. బోటు ఘ‌ట‌న‌లో 22 మంది చ‌నిపోయారు. దీంతో బాబు ఆవేద‌న అర్థం చేసుకోవ‌చ్చు.

అంత వ‌ర‌కు బాగానె ఉంది కాని…పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.. అదీ ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్‌ కారణంగా. మరి, దానికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారట.? ఇంకా నయ్యం, అక్కడున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన ఏమైనా చేయొచ్చుగాక. మ‌రి అఖిల‌కు వ‌ర్తించిన రాజీనామా వ్యాఖ్య‌లు బాబుకు వ‌ర్తించ‌వా..? అంటె అదొక్క‌టి అడ‌క్కు.

పర్యాటక శాఖ మంత్రిగా అఖిలప్రియ పనితీరు గురించి టీడీపీలోనే విమర్శలు రావడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. నంద్యాల ఉప ఎన్నిక స‌మ‌యంలో అస‌లు అఖిల‌ను ఆశాఖ‌వైపు క‌న్నెత్తికూడా చూడ‌నివ్వ‌లేదు. ఇప్పుడు అఖిలప్రియకి ‘పొగ’ పెట్టేస్తున్నార‌నె చెప్పుకోవాలి. అయినా బాబు రాజ‌కీయాలను అర్థం చేసుకోవ‌డం అఖిల‌కు అంత తేలిక విష‌యం కాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -