హీరో శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన తరువాత వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.కుర్ర హీరోల పక్కన బాబాయ్,అన్నయ్య, విలన్ రోల్స్ చేస్తున్నాడు.ఇప్పుడు మరో క్రేజి ప్రొజెక్ట్‌లో అవకాశం వచ్చింది.చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట, ఆ పాత్రను ఒక సీనియర్ హీరోతో చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బోయపాటి వ్యక్తం చేశారట.
ఆ పాత్రకి శ్రీకాంత్ ను తీసుకుందామని చరణ్ పట్టుబట్టడంతో బోయపాటి ఓకే అనేశారని తెలుస్తోంది. గతంలో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో చరణ్ బాబాయ్ గా శ్రీకాంత్ నటించాడు. మళ్లీ ఈ సినిమాతో వీళ్ల కాంబినేషన్ తెరపై సందడి చేయనుందని అంటున్నారు. త్వరలోనే శ్రీకాంత్ ఈ సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడని చెబుతున్నారు.ఈ సినిమాలో హీరోయిన్‌గా కైరా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే.
