- Advertisement -
ఆద్యా న్యూస్ చెప్పింది నిజమైంది. శ్రీకాంత్ కుమారుడు రోషన్ ను హీరోగా పెట్టి……. నాగార్జున తీస్తున్నాడని చెప్పిన సినిమా స్టిల్స్…. ఇపుడు బయటకు వచ్చాయి.
ఈ స్టిల్ చూస్తుంటే ఊహా, శ్రీకాంత్ పోలికలు రోషన్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిర్మలా కాన్వెంట్ పేరుతో రాబోతోన్న ఈ సినిమాతో రోషన్… లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. పి.రామ్మోహన్ డైరెక్షన్ లో సెట్స్ మీదకు వెళ్లబోతోన్న ఆ సినిమా తాలూకు ఫస్ట్ టీజర్ ను దసరాకు రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. లేడీ ఫ్యాన్స్ కు ఎంతగానో దగ్గరైన శ్రీకాంత్… ఇపుడు తన కుమారుడిని ప్రేక్షకుల మీదికి వదిలి ఎంతమంది అమ్మాయిలను ఊహల్లో ఊరేగిస్తాడో చూడాలి.