దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటున్న పెళ్లి సందD మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో రాఘవేంద్ర రావు రొమాంటిక్ సెన్స్ మరోసారి రిపీట్ అయింది. 1996 లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరో శ్రీకాంత్,రవళి,దీప్తీ పట్నాగర్ ముఖ్యభూమిక పోషించిన ‘పెళ్లి సందడి’ సూపర్ హిట్ అయ్యింది. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి.
చాలా కాలం తర్వాత శ్రీకాంత్ తనయుడు తనయుడు రోషన్, శ్రీ లీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. కె. కృష్ణమోహన్ రావు సమర్పిస్తుండగా మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
రాఘవేంద్ర రావుకి ఏప్రిల్ 28వ తేదీతో ఉన్న సెంటిమెంట్ కారణంగా ఈ రోజే ‘పెళ్లి సందD’ హంగామా షురూ చేశారు. ‘ప్రేమంటే ఏంటి’ అంటూ సాగిపోతున్న ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ రాయగా హరి చరణ్, శ్వేతా పండిట్ ఆలపించారు. పెళ్లి సందడి’కి కొనసాగింపు చిత్రం కాదని ముందే చెప్పిన రాఘవేంద్రుడు ఈ సినిమాతో ఇంకెలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.
టాలీవుడ్ 100 కోట్ల సినిమా.. అక్కడ మాత్రం అట్టర్ ప్లాప్!
