టాలీవుడ్లో ఈమధ్య వస్తోన్న సినిమాలు ప్రేక్షకుడిని భాగా విసిగెత్తించేస్తున్నాయి.
ఎంటర్ టైన్ మెంట్ పేరు చెప్పి జనాలను థియేటర్లో కూర్చో బెట్టి…వారి సహనంతో ఆడుకుంటున్నాయి.సింపుల్ గా చెప్పాల్సిన స్టోరీని లాగి లాగి విసిగెత్తించేస్తుండడంతో…. అంతా ట్రిమ్ చేసిన స్టోరీలపైనే మక్కువ చూపుతున్నారు. తాజాగా కిక్ 2 , శివం చిత్రాలు కూడా 150 నిమిషాల కంటే ఎక్కువగా ఉండి చాలా మంది ప్రేక్షకులను థియేటర్లో ఇబ్బంది పెట్టాయి.
త్వరలో రాబోతోన్న రుద్రమదేవి కూడా ఏకంగా 158 నిమిషాలు ఉంటుందట. అంటే 2గంటల 38 నిమిషాలు. అలాగే అఖిల్ చిత్ర నిడివి కూడా 150 నిమిషాలకు పై మాటే. నాగ్ ఆర్డర్ తో అది 140 నిమిషాలకు కుదించినట్లయింది.ఇంత సుదీర్ఘ నిడివితో సినిమా చూడాలంటే జనాలకు ఎంతో ఓపిక కావాలి.అది లేకనే చాలా చిత్రాలు పరాజయం చెందుతున్నాయి.
కాని ఈ విషయంలో బాహుబలి,శ్రీమంతుడు చిత్రాలు పాస్ అయిపోయాయి.ఈ సినిమాల నిడివి 150 నిమిషాలకు పై మాటే.కథ,కథనాలు భాగా రావడంతో ఈ రెండు చిత్రాల మ్యాటర్లో సుధీర్ఘ నిడివి అనే మాట రాకుండా పోయింది.