- Advertisement -
ఈరోస్ ఇంటర్నేషనల్ కు శ్రీమంతుడు మాంచి కిక్ నిచ్చింది. ఇప్పటికే ఈ సినిమా వందకోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడంతో అక్టోబర్ లో వచ్చే సెకండ్ క్వార్టర్ ఫలితాల్లో ఈరోస్ మంచి లాభాలను ప్రకటించే అవకాశం ఉంది.
దీంతో ఈ సంస్థకు మార్కెట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పాసై…. షేర్ మరింతగా పెరిగింది. ఫస్ట్ క్వార్టర్లో తన వెడ్స్ మను రిటర్న్స్ ఫలితాలతో ఈ సంస్థ 48.85% పెరుగుదలను నమోదు చేసి 53.35 కోట్ల లాభాలను వెనకేసింది. సో శ్రీమంతుడుతో అది సెకండ్ క్వార్టర్లోను కంటిన్యూ అయి …. మరింత మెరుగైన లాభాలను ఈరోస్ ప్రకటిస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏది ఏమైనా శ్రీమంతుడు సినిమా ఓ కార్పొరేట్ షేర్ ను ఇలా ప్రభావితం చేయడం నిజంగా విశేషమే.