శాసనసభలో హెబ్బాపటేల్ స్పెషల్ సాంగ్..!

Hebah Patel Special Song in Sasanasabha Movie
Hebah Patel Special Song in Sasanasabha Movie

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న పాన్‌ఇండియా చిత్రం శాసనసభ. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో అందాలతార హెబ్బాపటేల్ ఓ ప్రత్యేక పాటలో నర్తించింది. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ ప్రత్యేకపాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న రవిబసుర్ సంగీత ఈ చిత్రానికి హైలైట్‌గా వుంటుంది.

ఈ ప్రత్యేకపాటను ఆయన సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రత్యేకపాటను ప్రేమ్క్ష్రిత్ నృత్యరీతులు అందించగా, పాపులర్ సింగర్ మంగ్లీ ఆలపించారు. ముఖ్యంగా ఈ పాట మాస్‌ను ఉర్రూతలూగిస్తుంది.త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.ఈ చిత్రానికి కథ- మాటలు: రాఘవేందర్‌రెడ్డి.

Also Read

పుష్ప2 లో మెయిన్ విలన్ ” షెకావత్ ” కాదా ?

సలార్ పోస్టర్ రిలీజ్.. నిరాశలో ఫ్యాన్స్ !

పాలను ఫ్రిజ్ లో పెట్టవచ్చా… పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?