Sunday, May 19, 2024
- Advertisement -

శ్రీముఖి బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్లాలేదో తెలుసా..?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేస్తున్న షో.. బిగ్ బాస్ షో. ఈ షోకి ఇప్పుడు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే హిందిలో సూపర్ హిట్ అయిన ఈ షో.. తెలుగులో మొదటి సీజన్ కే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఎన్టీఆర్ వచ్చే రోజుల్లో టీఆర్‍పీ రేటింగ్ కూడా అద్భుతంగా ఉంది.

అయితే ఈ షో పార్టిస్పెంట్స్ ఎవరొస్తారా అని అందరు మొదట్లో అనుకున్నారు. తీరా వచ్చిన వారిని చూసిన ప్రేక్షకులకు ఊహించని స్టార్స్ దర్శనమిచ్చారు. ఇక వచ్చిన స్టార్స్ తోనే షోని నెట్టుకొచ్చారు. అయితే ఈ షోకి ముందు చాలా పెద్ద స్టార్స్ నే అనుకున్నారట. కానీ వారు అన్ని రోజులు హౌస్ లో ఉండడానికి ఇష్టపడలేదు. అలాగే మరికొంతమంది షూటింగ్స్ వల్ల బిజీగా ఉండి నో చెప్పారట. అయితే ప్రస్తుతం తెలుగులో యాంకర్ గా పాపులర్ అయిన శ్రీముఖీ కూడా మొదట బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందట కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదట. అందుకు గల కారణాన్ని రీసెంట్ గా సోషల్ మీడియా లైవ్ చాట్ లో నెటిజన్లకు చెప్పింది. మొదటగా ఆమె బిగ్ బాస్ షో అంటే నాకు చాలా ఇష్టమని చెబుతూ.. హిందీ బిగ్ బాస్ షో వచ్చినప్పుడు చూసిన షోలనే పదే పదే చూసేదన్నని చెప్పింది.

ఇక బిగ్ బాస్ చేయకపోవడానికి కారణం నేను పటాస్ వంటి షోలతో బిజీగా ఉండడం వల్లనేనని చెప్పింది. అంతే కాకుండా తనకు బిగ్ బాస్ లో నటించాలని అంతగా ఇంట్రెస్ట్ కూడా ఏమి లేదనేవిధంగా జవాబు ఇచ్చింది. దీంతో పాటు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిన ముందు రోజే ఓ కొత్త షోను ఒకే చేసినట్టు శ్రీముఖి చెప్పింది. అందువల్లే బిగ్ బాస్ లోకి వెళ్లలేదని ఆమె తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -