Thursday, May 2, 2024
- Advertisement -

బూతు వినలేదు.. కానీ నోరు జారిన రవి పరిస్థితి ఎలా అయిందంటే ?

- Advertisement -

నాగ చైతన్య ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో మహిళలపై చలపతిరావు కామెంట్స్ చేయడం.. ఆ కామెంట్స్ ని యాంకర్ రవి సమర్దించినట్లు మాట్లాడటంపై అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద దూమరం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై చలపతిరావుకి జరిగిన డ్యామేజ్ కంటే యాంకర్ రవికి జరిగిన డ్యామేజ్ ఎక్కువ.

అప్పట్లో జరిగిన విషయంపై రెండు రోజుల తరువాత రగడ మొదలైంది. అయితే చలపతి రావు చేసిన కామెంట్స్ ను తాను సరిగ్గా వినలేదని.. అందుకే ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్లు అరవడంతో ఏదైన జోక్ చేశారేమో అందుకే వినకున్న సమర్దించినట్లు వివరణ ఇచ్చాడు. అయితే ఇప్పటికి అతనికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక అప్పటినుండి రవి కి యాంకరింగ్ రంగం లో ఆఫర్స్ తగ్గిపోయాయని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే రారండో వేడుక చూద్దాం ఆడియో వేడుక తర్వాత యాంకర్ రవిని పూర్తిగా మర్చిపోయారు సినిమా వాళ్లు. అంతకు ముందు కేశవ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో యాంకర్ రవి ఓవర్ యాక్షన్ చేయడం.. తర్వాత చైతు సినిమా ఆడియో వేడుక ద్వారా అతడు కావాల్సినంత బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడంతో అప్పటి నుంచి రవికి సినిమా కార్య క్రమాల ఆఫర్స్ చేసేవాళ్లు పూర్తిగా తగ్గిపోయారు. ప్రస్తుతం అతడి చేతులో కేవలం రెండు షోలు మాత్రమే ఉన్నాయని వాటికి కూడా పెద్దగా రేటింగ్స్ లేవని అనిపిస్తోంది.

అయితే ఇదంతా రవి తన చేతులతో తానే చేసుకున్నాడని.. పలువురు అంటున్నారు. ఇంకోవైపు శ్రీముఖి సైతం రవితో కలిసి యాంకరింగ్ చేయనని అంటుందని.. అందుకు కూడా యాంకర్ రవికి ఆఫర్స్ తగ్గిపోయాయని తెలుస్తోంది. ఏదు ఏమైన మంచి యాంకర్ గా ఫాపులర్ అయిన రవి.. ఇప్పుడు మెల్ల మెల్లగా యాంకరింగ్ నుంచి వెనకబడుతున్నాడని.. అతడి కెరీర్ గ్రాఫ్ ని బట్టి అర్ధమౌతుంది. అయితే రవి మళ్లీ ఫాంలోకి రావాలంటే.. ఏదైన కొత్త షోతో మళ్లీ అందరికి ఆకట్టుకోవాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -