Thursday, May 2, 2024
- Advertisement -

జ‌గ‌న్ మ‌రో త‌ప్పిదం చేస్తున్నారా…?

- Advertisement -

వ‌రుస ఓట‌ముతో డీలాప‌డ్డ వైసీపీని దెబ్బ‌కొట్టేందుకు చంద్ర‌బాబు నాయుడు మాస్ట‌ర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. జ‌గ‌న్ లండ‌న్ నుంచి రాష్ట్రానికి వ‌చ్చే లోపు ప‌ని ముగించాల‌ని భావిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టు ప్ర‌ణాలిక‌ను సిద్దం చేస్తోంది టీడీపీ . నిరాశ‌లో ఉన్న నాయ‌కుల‌ను ఆక‌ర్శించేందుకు మ‌రో సారి టీడీపీ కూడా మైండ్ గేమ్ మొదలుపెట్టేసింది.

ఇలాంటి తరుణంలో వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటనకు వెళ్తుండటం టీడీపీకి కలిసొచ్చే అంశంగా మారిందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన కొంతమంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారని చెబుతున్న టీడీపీ.. జగన్ లేని సమయాన్ని అందుకోసం ఉపయోగించుకోవాలని భావిస్తోంది.

వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ ఉనికిని పూర్తిగా ప్రశ్నార్థకం చేయాలన్న కృతనిశ్చయయంతో ఉన్న అధికార పార్టీ.. ఇప్పటినుంచే ఆపరేషన్ ఆకర్ష్ ప్లాన్ ను అమలు చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. న‌యానో ..భ‌యానో వారిని త‌మ పార్టీలోకి ఆక‌ర్శించేందుకు సిద్ద‌మ‌య్యింది. ప్రధానంగా 2019ఎన్నికల్లో జగన్ ప్రభావాన్ని తగ్గించవచ్చనేది వారి ఆలోచనగా తెలుస్తోంది.

జగన్ పెద్ద కూతురు హర్షకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో సీటు వచ్చినందునా.. ఆమెను జాయిన్ చేసేందుకు జగన్ సోమవారం లండన్ వెళ్తున్నారు. తిరిగి 19వ తేదీన ఆయన ఏపీకి వస్తారు. ఈ ఎనిమిది రోజుల గ్యాప్ లో.. వైసీపీలో ప్రకంపనలు పుట్టించాలని టీడీపీ భావిస్తోంది. జగన్ వచ్చేలోపు ఆ పార్టీకి డ్యామేజ్ చేయగలిగితే.. మున్ముందు తమ పని మరింత సులువు అవుతుందని భావిస్తోంది.

ఇప్పుడే చేర‌క‌పోయినా మున్మందు పార్టీలో చేరె అవ‌కాశాలు ఉంటాయంటున్నారు. ఏదేమైనా జగన్ లేని సమయంలో వైసీపీని దెబ్బ కొట్టడానికి టీడీపీ కాచుకు కూర్చుందనేది మాత్రం స్పష్టమవుతోంది. నేతల్లో ఆత్మన్యూనతను పోగొట్టే బాధ్యతను జగన్ తీసుకోకపోవడం వల్లే ఫిరాయింపులకు ఆస్కారం ఏర్పడే అవకాశం ఉంది. జగన్ ఇలాగే వ్యవహరిస్తే మరో వ్యూహాత్మక తప్పిదం చేసినట్లే అవుతుంది. లేకుంటె భవిష్యత్తు మరింత ప్రతికూలంగా ఉంటుందనేది చాలామంది వాదన.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -