అవసరాల శ్రీనివాస్ హంటర్ అవ్వాలనుకుంటున్నాడు.అతను అనుకుంటున్నాడు సరే.మరి దానికి మన సెన్సార్ బోర్డ్ ఎంత వరకు ఒప్పుకుంటుందనేది సందేహంగానే ఉంది. ఎందుకంటే గత ఏడాది బిటౌన్లో వచ్చిన అడల్ట్ కామెడీ హంటర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.కేవలం 6 కోట్లతో తీసిన ఈ చిత్రం పదిరోజుల్లోనే రెట్టింపు మొత్తాన్ని ఆర్జించింది.సెన్సార్ కట్ లు కూడా చాలా ఎక్కువగానే పడ్డాయి.
అయినప్పటికీ థియేటర్లో చూపించాల్సిన సినిమాను ప్రేక్షకులకు దర్శకుడు హర్షవర్దన్ కులకర్ణి చూపించేశాడు. ఇపుడు హంటర్ సినిమాను తెలుగులో అవసరాల శ్రీనివాస్ తో చేద్దామని కొందరు అనుకుంటున్నారు.మరి తెలుగు సెన్సార్ బోర్డ్ గురించి తెలిసి కూడా హంటర్ ను ఎలా రీమేక్ చేయాలనుకుంటున్నారో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.
చిన్న బూతు వస్తేనే చిరిగి చాటంతై…ఆ తరువాత చాపంత అవుతుంది.అలాంటిది మొత్తం బూతునే యూత్ టార్గెట్ సినిమాగా చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి.ఇపుడు అదే జరగబోతోంది.అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమా కథనం తయారవ్వబోతోంది.అవసరాల శ్రీనివాస్ కూడా మాంచి టాలెంటెడ్ పర్సన్ కాబట్టి…అతను స్క్రిప్ట్ విషయంలో జోక్యం చేసుకుని టైమింగ్ తో లాక్కొస్తాడని చెబుతున్నారు.
