Monday, April 29, 2024
- Advertisement -

హ్యాపిగా ఉండుటకు చిట్కాలు!

- Advertisement -

* యవ్వనంగా భావించటం వలన వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అంతేకాకుండా, మానసికంగా ధైర్యాన్ని ఇవ్వటమే కాకుండా ఒత్తిడిని తగ్గించి, శరీర రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

* సామాజిక పరిచయాలు, ఎక్కువ మందితో కలిసి ఉండటం మంచిదే. ఒంటరితనం ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలుపుటకు కొన్ని నిరూపణలు కూడా ఉన్నాయి. సామాజిక కార్యకలాపాలలో పాల్గొనటం, ఇతరులకు సహాయ పడటం మరియు ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉండటం మంచిదే.

* మీరు ఎక్కువగా పార్టీలలో పాల్గొనటం మరియు స్నాహితులతో ఉత్సాహవంతంగా ఉండటం మంచిది. అంతేకాకుండా ఇలా చేయటం వలన శరీరంలో తక్కువ స్థాయిలో కార్టిసాల్ ఉత్పత్తి చెంది, డిమెంటియా(చిత్త వైకల్యం) వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

* వాహనాలను వాడటం కన్నా నడవటం వలన భౌతికంగా మరియు మానసికంగా ఉల్లసంగా ఉంటారు. రోజు ఇలా భౌతిక కార్యకలపాలను చేయటం వలన గుండె సంబంధిత వ్యాధులు కలిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా క్యాన్సర్, నాడీ సంబంధిత వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్’లకు కూడా దూరంగా ఉంటారు.

* పని మనిషి లేనందువలన మీ జీవిత కాలం పెరిగే అవకాశం ఉంది. ఇంటిని శుభ్రపరచటం, బట్టలు ఉతకటం, గార్గెన్’ను అందంగా తీర్చిదిద్దటం, మొక్కలకు నీటిని పట్టడం వంటి పనులను నిర్వహించటం వలన ఆరోగ్య సమస్యలు తక్కువగా కలుగుతాయి.

* గురకల వలన శ్వాసలో సమస్యలు మాత్రమె కాకుండా, మీ ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశం ఉంది. నిద్రలో గురకల వలన రక్తే పీడనం అధికం అవటం, జ్ఞాపక శక్తి లోపాలు, బరువు పెరుగుదల మరియు డిప్రెషన్ వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. 

ఈ విషయంలో జన్యువులు ప్రధానపాత్ర పోషిస్తాయి. కానీ జీవన శైలి మాత్రం దీని కన్నా ముఖ్యం. ఒకవేళ మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చుపినట్లయితే మీ జీవిత కాలాన్ని మీ చేతులారా నాశనం చేసుకుంటున్నట్టు. కావున వీటి పైన సరైన నిర్ణయం తీసుకొని మీ జీవిత కాలాన్ని పెంచుకోండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -